Begin typing your search above and press return to search.

ఇలా అయితే పంతం గెలిచేదెలా?

By:  Tupaki Desk   |   3 July 2018 1:30 AM GMT
ఇలా అయితే పంతం గెలిచేదెలా?
X
ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా ఉంది గోపీచంద్ పరిస్థితి. రెండు రోజుల్లో తన కొత్త సినిమా పంతం విడుదల అవుతున్నా దాని తాలూకు హడావిడి మాత్రం కనిపించడం లేదు. అసలే ప్రమోషన్ వీక్ గా ఉంది. దానికి తోడు ట్రైలర్ ఏదో జస్ట్ ఓకేలా అనిపించిందే తప్ప అంచనాలు అయితే మోసుకురాలేదు. ఈ నేపథ్యంలో పంతంని లైఫ్ అండ్ డెత్ లా భావిస్తున్న గోపీచంద్ దానికి తగ్గ జోష్ ని కనీసం ఫాన్స్ లో నింపే ప్రయత్నం చేయటం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా అది జరిగిన సంగతి కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియనంత సైలెంట్ గా అయిపోయింది. దానికి తోడు మరుసటి రోజే సాయి ధరమ్ తేజ్ సినిమా తేజ్ ఐ లవ్ యు కూడా వస్తోంది. దానికీ ఎగబడే సీన్ లేదు కానీ ఉన్నంతలో యూత్ దాని వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది కనక ఓపెనింగ్స్ విషయంలో రెండో రోజే గోపిచంద్ కు పోటీ ప్రారంభమవుతుంది. వీటికి తోడు గత ఏడాది గౌతమ్ నందా-ఆక్సిజన్ ఫలితాలు ట్రేడ్ ని ఎక్కువ పెట్టుబడి పంతం మీద పెట్టకుండా ఆపాయని ఇప్పటికే టాక్ ఉంది.

సో పంతం హిట్ అయితే తప్ప గోపీచంద్ తరువాత చేయబోయే సినిమాల వేగంలో కదలిక రాదు. ఇన్ డైరెక్ట్ ఈ మాట గోపినే ఒప్పుకున్నాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి దీన్ని ఎలా టేకప్ చేసుంటాడా అనే అనుమానంతో పాటు ట్రైలర్ లో చూపించినట్టు రెగ్యులర్ కమర్షియల్ మసాలాకు మెసేజ్ జోడించిన ప్రయత్నం కనిపించింది. దీంతో పంతం గెలవడం మీద కొన్ని అనుమానాలు లేకపోలేదు. పైగా హీరోయిన్ మెహ్రీన్ సక్సెస్ ట్రాక్ నుంచి కాస్త పక్కకు వచ్చింది. జవాన్-కేరాఫ్ సూర్య ఫలితాలు కొంత ప్రతికూల ప్రభావం చూపించాయి. గోపి సుందర్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తోంది తప్ప గోపిచంద్ ఒకప్పటి మ్యూజికల్ హిట్స్ రణం-యజ్ఞం స్థాయిలో ఆల్బమ్ వచ్చి చాలా కాలమే అయ్యింది. సో హిట్ అయ్యే తీరాలి అనే కండిషన్ మీద విడుదలవుతున్న పంతం ఎంత మాత్రం అంచనాలు నిలబెట్టుకుంటుందో గురువారం తేలిపోతుంది.