Begin typing your search above and press return to search.
కొత్తగా చేద్దామన్నా చేసేదేం లేదు
By: Tupaki Desk | 4 July 2018 10:18 AM GMTటాలీవుడ్ లో అర్జెంట్ గా ఓ కమర్షియల్ హిట్ అవసరమున్న హీరో గోపీచంద్. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించిన లౌక్యం సినిమా తరవాత గోపీచంద్ కు హిట్టన్నదే కరువైపోయింది. ఒకానొక టైంలో ఈ హీరో సినిమాలు రిలీజవడమే కష్టంగా మారింది. ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ ఇప్పుడు రిలీజవుతున్న పంతం సినిమాపైనే ఉన్నాయి.
పంతం సినిమా ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని.. అందరినీ సంతోషంగా చూడాలనుకునే ఓ మనిషి తన పంతంతో ఎలా గెలిచాడనేదే ఈ మూవీ కాన్పెస్ట్ అని గోపీంచంద్ అంటున్నాడు. ఈమధ్య వరసగా ఎదురవుతున్న ఫ్లాపులపై మాట్లాడుతూ తాను చేసినవన్నీ మంచి కథలేనని చెప్పుకొచ్చాడు. ‘‘నేనింతవరకు చేసిన సినిమాలన్నీ స్క్రిప్ట్ పరంగా చూసినప్పుడు సూపర్ గా ఉన్నాయి. వాటిని తెరకెక్కించడంలో మాత్రం తేడా వచ్చేసింది. డైరెక్టర్ చెప్పిన దానికి తీస్తున్న దానికి తేడా వస్తోందనే విషయం మధ్యలోనే తెలిసిపోతోంది. అప్పటికి ఇంక చేసేదేం లేకపోవడంతో ముందుకెళ్లక తప్పలేదు. సినిమాకు జరిగే నష్టం తప్పించడానికి నా వంతు ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు’’ అంటూ తన ఫ్లాపుల వెనుక రీజన్ చెప్పుకొచ్చాడు.
తనకు కొత్తగా.. డిఫరెంట్ గా ఉండే పాత్రలు చేయాలని ఉన్నప్పటికీ తన చేతిలో ఉన్న ఆఫర్లు లిమిటెడ్ గానే ఉన్నాయని గోపీచంద్ అంటున్నాడు. ‘‘ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయడంపై చాలామంది నన్ను అడిగారు. కానీ నాకున్న వాటిలో బెస్ట్ చేస్తున్నాను. కెరీర్ లో మరో మెట్టు ఎక్కే సినిమా కోసం నేనూ చూస్తున్నాను.’’ అంటూ గోపీచంద్ తన ఫీలింగ్ చెప్పుకొచ్చాడు. పంతం మూవీతో చక్రి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.