Begin typing your search above and press return to search.

వామ్మో.. అందరూ సైన్స్ మీదనే పడ్డారే

By:  Tupaki Desk   |   27 Nov 2017 1:01 PM GMT
వామ్మో.. అందరూ సైన్స్ మీదనే పడ్డారే
X
ఇప్పుడు 'ఆక్సిజన్' సినిమా కొత్త ట్రైలర్ ఒకటి వచ్చింది. ఆ ట్రైలర్ ను చూసిన వెంటనే.. ఏంటి సడన్ గా టాలీవుడ్ అంతా కూడా ఇలా మారిపోయింది అనే సందేహం ఎవ్వరికైనా వస్తోంది. ఈ మధ్యనే మనోళ్లు 'పిఎస్వీ గరుడవేగ' సినిమాను బాగా ఆదరించిన తరువాత.. ఇప్పుడు అదే తరహాలో అందరూ సైన్స్ ఫిక్షన్ వైపే అడుగులు వేస్తున్నారు అనే సందేహ రాక మానదు.

గరుడవేగ సినిమాలో.. హ్యాకింగ్.. అలాగే అడ్డాన్స్డ్ బాంబ్ డిటెక్షన్.. సర్వయిలెన్స్ వంటి అంశాలపై కాస్త గట్టిగానే చూపించారు. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని.. ఏదో బొమ్మల డబ్బాలతో పని కానిచ్చేయకుండా.. గ్రాఫిక్స్ కూడా వాడుకుని.. నిజంగా ఏదో జరుగుతున్నట్లు ఫీల్ తెప్పించారు. కట్ చేస్తే.. 'జవాన్' సినిమా ట్రైలర్ వచ్చింది. అందులో కూడా అంతే.. మనోళ్ళు ఏదో అడ్వాన్స్డ్ మిస్సయిల్ ఒకటి డిఫెన్స్ వారి నుండి లీకవ్వడం.. దానిని ఒక యువకుడు కాపాడటం అనే అంశంలో.. సైన్స్ అండ్ టెక్నాలజీ.. డిజిటల్ యుగపు ఇన్నోవేషన్లు.. కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో బాగా చూపించారని తెలుస్తోంది.

ఇప్పుడు 'ఆక్సిజన్' సినిమా కొత్త ట్రైలర్లో కూడా.. ఒక గ్రామంలో ఏదో జరగడం.. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఏవో బాంబులూ.. మ్యాపింగ్.. ఏరియల్ డిటెక్షన్.. అబ్బో ఆ విధంగా చాలా హంగామా చేశారు. చూస్తుంటే మరో టెక్నలాజికల్ బ్రిలియన్స్ ఉన్న సినిమా అనిపించేలా ఉంది. అసలు ఒకేసారి అందరూ ఇలాంటి కాన్సెప్టులే తీసుకుంటున్నారేంటో మరి. కథల దొరుకుతున్నాయా? గ్రాఫిక్స్ కంపెనీలు తక్కువ రేటుకే అలాంటి వర్క్ చేసిస్తున్నాయా?