Begin typing your search above and press return to search.
'ఆక్సిజెన్' మళ్ళీ మారింది
By: Tupaki Desk | 22 Sep 2017 1:26 PM GMTటాలీవుడ్ లో ఎంతో కష్టపడి హీరోగా ఎదిగిన యాక్షన్ హీరో గోపీచంద్ అదృష్టం ఈ మధ్య ఏం బాగుండడం లేదు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. చివరి నిమిషంలో కూడా సినిమాలు వాయిదాలు పడుతూ.. గోపి ఇమేజ్ ని కాస్త దెబ్బ తీస్తున్నాయనే చెప్పాలి. సాధారణంగా చిన్న సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
కానీ గోపికి తనకంటూ ఓ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. కేవలం నిర్మాతల కారణంగా అతడి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుందనే చెప్పాలి. బి. గోపాల్ దర్శకత్వంలో తీసిన ఆరడుగులబుల్లెట్ సినిమా విడుదలకు నోచుకోకుండానే మాయమైంది. అయితే ఇప్పుడు అదే ఇబ్బందులను 'ఆక్సిజెన్' కూడా ఎదుర్కొంటుందా అనే అనుమానాలను కలిగిస్తోంది. ఎప్పుడో షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా గత కొంత కాలంగా రిలీజ్ డేట్స్ పై ఒక నిర్దారణకు రాలేకపోతోంది. చిత్ర యూనిట్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. గతవారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఈ సినిమా ను అక్టోబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ డేట్ కాదని మరొక డేట్ ను ఫిక్స్ చేశారు.
అక్టోబర్ 28న తప్పకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని చిత్ర నిర్మాత ఐశ్వర్య తెలిపారు. జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా - అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.