Begin typing your search above and press return to search.
ఔను.. ఆక్సిజన్ రిలీజవుతోంది
By: Tupaki Desk | 26 Nov 2017 5:29 AM GMTగోపీచంద్ సినిమా ‘ఆక్సిజన్’ రిలీజ్ అంటుంటే జనాలు జోకులు పేలుస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు రిలీజ్ డేట్ ఇవ్వలేదు.. మళ్లీ వాయిదా వేయలేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఐతే ఈసారి ఈ సెటైర్లకు తెరపడేలాగే ఉంది. నవంబరు 30న పక్కాగా ఈ సినిమా రిలీజయ్యేలాగే ఉంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ పోస్టర్లను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేసింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా రేపో ఎల్లుండో పూర్తవుతాయని సమాచారం. ఫైనాన్స్ సమస్యలన్నింటినీ క్లియర్ చేసి.. సినిమాను విడుదలకు సిద్ధం చేశాడట ఎ.ఎం.రత్నం. దర్శక నిర్మాతలతో రిలేషన్స్ అంత బాగా లేనప్పటికీ గోపీచంద్ ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కూడా కలవబోతున్నాడట.
రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆక్సిజన్’. ఇది మొదలై రెండేళ్లు దాటింది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ దశలోనే దీనికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఎలాగోలా సినిమాను పూర్తి చేసినా.. విడుదలకు సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 18 నుంచి నాలుగైదుసార్లు రిలీజ్ డేట్ మార్చారు. చివరగా నవంబరు 17కు రిలీజ్ అనుకున్నారు. అప్పుడు కూడా కుదర్లేదు. ఐతే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోందంటున్నారు. గోపీచంద్ సరసన అను ఇమ్మాన్యుయెల్.. రాశి ఖన్నా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఇంతకుముందు జ్యోతికృష్ణ తీసిన ‘నీ మనసు నాకు తెలుసు’.. ‘కేడి’ ఫ్లాపయ్యాయి. మరి దర్శకుడిగా మూడో ప్రయత్నంలో అయినా అతను విజయవంతమవుతాడేమో చూడాలి.