Begin typing your search above and press return to search.
గోపీ నయం.. తేజు భయానకం
By: Tupaki Desk | 9 July 2018 10:06 AM GMTవరుస ఫ్లాపులతో సతమమతువుతున్న ఇద్దరు హీరోలు గత వారాంతంలో బాక్సాఫీస్ పరీక్షకు నిలిచారు. కానీ రెండు సినిమాలకూ ఆశించిన టాక్ రాలేదు. గోపీచంద్ సినిమా ‘పంతం’తో పాటు సాయిధరమ్ తేజ్ మూవీ ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా నెగెటివ్ టాక్ తోనే మొదలయ్యాయి. కాకపోతే ఈ రెండు సినిమాల వసూళ్లు మాత్రం ఒకేరకంగా లేవు. కొంతలో కొంత గోపీ సినిమా పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆ చిత్రం తొలి రోజు రూ.3 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఆ తర్వాత కూడా ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోతుంది. కానీ తేజు సినిమా సంగతే దయనీయంగా ఉంది. ‘తేజ్ ఐ లవ్యూ’కు తొలి రోజు రూ.1.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అదే ట్రెండ్ రెండో రోజు కూడా కొనసాగింది. వసూళ్లు మరింత పడిపోయాయి.
‘పంతం’ కూడా ఏమంత విషయం లేని రొటీన్ సినిమానే. కాకపోతే అందులో మాస్ ప్రేక్షకులకు నచ్చే కొన్ని అంశాలున్నాయి. గోపీచంద్ నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ కు అందులో లోటు లేదు. కొంచెం కామెడీ కూడా వర్కవుటైంది. ఇక కోర్టు నేపథ్యంలో సాగే పతాక సన్నివేశానికి ప్రేక్షకులు బాగానే కనెక్టవుతున్నారు. దీంతో వసూళ్లు మరీ పేలవంగా లేవు. ముఖ్యంగా బి-సి సెంటర్లలో సినిమా పరిస్థితి బాగుంది. అక్కడ ఈ సినిమా మంచి షేర్ సాధిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షేర్ రూ.10 కోట్లకు చేరువగా ఉంది. కానీ ‘తేజ్ ఐ లవ్యూ’లో మాస్ ప్రేక్షకులు ఆశించే వినోదం ఏమీ లేదు. తేజు గత సినిమాల్లో మాదిరి ఇందులో యాక్షన్ లేదు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. పోనీ క్లాస్ ఆడియన్స్ కు అయినా ఈ సినిమా నచ్చుతోందా అంటే అదీ లేదు. వాళ్లూ ఈ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు. దీంతో వసూళ్లు పేలవంగా ఉన్నాయి. రూ.5 కోట్ల షేర్ మార్కును అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. తేజు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ‘ఇంటిలిజెంట్’ సరసన నిలిచేలా ఉందీ చిత్రం.