Begin typing your search above and press return to search.
గ్రహపూజలతోనైనా ఆ హీరో గాచారం బాగు పడుతుందా?
By: Tupaki Desk | 25 May 2017 7:59 AM GMTగాచారం గడ్ బిడ్ హోనేతో ఖుదా బీ కుచ్ నహీ కరేగా అంటారు అనుభవశీలురు. ఎంతటివారికైనా బ్యాడ్ టైమ్ అనేది ఒకటుంటుంది, ఆ టైంలో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకుని, వరుస విజయాలతో దూసుకెళ్లిన హీరో గోపీచంద్ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. చేపట్టిన ఏ ప్రాజెక్టూ కలసి రావడం లేదు. జిల్ సినిమా నిలబెడుతుందని అనుకున్నా అది జరగలేదు. ఆరడుగుల బుల్లెట్ సినిమా స్టార్ట్ చేసిన తరువాత డైరక్టర్ మారిపోవడంతో అతీగతీ లేకుండా అయిపోయింది. పీవీపీ వాళ్లు డబ్బులు పెట్టినా కూడా అది ముందుకు కదలడం లేదు. ఇక ఏఎమ్ రత్నం తీస్తున్న ఆక్సిజన్ కూడా ఏమాత్రం ఊపిరి ఇచ్చేలా కనిపించడం లేదు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న గౌతమ్ నందా ఇప్పుడిప్పుడే అయ్యేటట్లు లేదు. అంతకుమించి గోపీచంద్ చేతిలో వేరే ప్రాజెక్టులే లేవు.
దీంతో ఇదంతా గ్రహ దోషాల వల్లే అని గోపీ భావిస్తున్నాడట. అందుకే గ్రహాలను సెట్ చేసుకుంటే తప్ప మళ్లీ మంచి రోజులు వచ్చేలా లేవని అనుకుని గ్రహాలకు జపాలు చేయిస్తున్నాడు గోపీచంద్. రెండు రోజులుగా ఆయన ఇంట్లో గ్రహ శాంతి పూజలు జరుపుతున్నారు. గురువారంతో అవి ముగుస్తాయి. ఇకనైనా గోపీ కి మంచి టైమ్ వస్తుందని ఆశిద్దాం.
ఇక్కడ పెద్ద ట్విస్టేంటంటే... గోపీచంద్ ఫ్యామిలీది కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్. ఆయన తండ్రి టి.కృష్ణ బలమైన కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు. దేవుడు దెయ్యం అంటే ఎక్కడా? చూపించు అనే రకం. కానీ... గోపీచంద్ మాత్రం చివరకు ఈ నమ్మకాల దారిలో సాగక తప్పడం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/