Begin typing your search above and press return to search.
మళ్లీ అలాంటి సినిమాతో మీ ముందుకు వస్తున్నా: గోపీచంద్..!
By: Tupaki Desk | 21 April 2023 9:59 AM GMTఫ్యామిలీ హీరో గోపీచంద్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. మంచి కటౌట్ ఉండి, సూపర్ గా డైలాగులు, యాక్షన్ చేయగల సత్తా ఉన్నా, కొంతకాలంగా ఆయనకు సినిమాలుపెద్దగా కలిసిరావడం లేదు. అందుకే... ఆయన ఈసారి కుటుంబ కథతో మన ముందుకు వస్తున్నారు. సినిమా పేరు కూడా హోమ్లీ ఫీలింగ్ కలిగేలా రామబాణనం అని పెట్టారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శ్రీవాస్ దర్శకత్వం వహించారు.
కాగా, రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ నిజంగానే ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ వేసవిలో కుటుంబం మొత్తం వచ్చి సినిమాని వీక్షించేలా, హాయిగా ఆనందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో గోపీచంద్ తమ బృందానికి సహకరించిన ఎంపీ మార్గాని భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవాస్ దర్శకత్వం వహించిన లక్ష్యం, లౌక్యం లాగానే రామబాణం కూడా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని గోపీచంద్ అన్నారు. సినిమా మొదటి నుంచీ హోమ్లీ వాతావరణంలో ఉంటుందని గోపీచంద్ అన్నారు. అలీతో తన కెమిస్ట్రీ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత లక్ష్యం, లౌక్యం లాంటి చిత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. తనకు అన్ని విషయాల్లో మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
గోపీచంద్ తన సహనటులు జగపతి బాబు, ఖుష్బు, డింపుల్ హయాతి ఇతరులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కథా రచయిత భూపతి రాజా, డైలాగ్ రైటర్ మధు, స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేసిన అబ్బూరి రవికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి చాలా మంచి పాటలు ఇచ్చారని గోపీచంద్ అన్నారు
నటుడు తన నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ , వివేక్ కూచిభొట్లకి కృతజ్ఞతలు తెలుపుతూ, వారి వల్ల అవుట్‌పుట్ బాగా వచ్చిందని అన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని గోపీచంద్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈరామబాణం 5 మేన ప్రేక్షకుల ముందుకు రానుంది.