Begin typing your search above and press return to search.

హారర్ స్టోరీలో మాస్ హీరో?

By:  Tupaki Desk   |   10 Oct 2022 4:11 AM GMT
హారర్ స్టోరీలో మాస్ హీరో?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ హీరోగా గుర్తింపు అందుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. అతను మొదట్లో విలన్ గా ట్రై చేసి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. టి కృష్ణ గారి వారసుడిగా అతను సినిమా పరిశ్రమంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.

హీరోగా వర్కౌట్ కాకపోవడంతో ఆ తర్వాత జయం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి వర్షం నిజం సినిమాలతో కూడా మంచి నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. తర్వాత యజ్ఞం లక్ష్యం రణం శౌర్యం సినిమాలతో అతని మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం గోపీచంద్ పెద్దగా కెరీర్ రేంజ్ పెరిగే సినిమాలు ఏమీ చేయలేదు. మధ్యలో ఒక సాహసం తప్పిస్తే మిగతా సినిమాలో అసలు వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.

ఆ విధంగా గోపీచంద్ కెరీర్ డౌన్ కావడానికి అతను ఎంచుకున్న రొటీన్ కమర్షియల్ కథలే. మిగతా మాస్ హీరోలు కూడా ఇప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలలో చాలా మార్పులు చేస్తున్నారు. యాక్టింగ్ లో కూడా కొత్తగా కనిపించేందుకు కృషి చేస్తున్నారు. కానీ గోపీచంద్ మాత్రం ఇంకా సిటీ మార్, పక్క కమర్షియల్ అంటూ అదే తరహా కథలతో వెళుతూ ఉండడం అతనికి మైనస్ అయింది.

అయితే ఇప్పుడు శ్రీవాస్ దర్శకత్వంలో కూడా దాదాపు అదే తరహాలో ఒక కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఒక కొత్త దర్శకుడితో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న గోపీచంద్ అతను చెప్పిన హారర్ కథ ఒకటి బాగా నచ్చిందట.

చిన్న బడ్జెట్ లోనే ఆ సినిమా చేయాలనుకుంటున్నారట. త్రిల్లింగ్ అంశాలు కూడా సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా కంటెంట్తో వస్తే ప్రేక్షకుల్లో కొంత డిఫరెంట్ గా ఆకట్టుకోవచ్చు అని గోపి ఆలోచిస్తున్నాడు.

అయితే ఇంతవరకు గోపీచంద్ ఈ తరహా కంటెంట్ తో వచ్చింది లేదు. కానీ ఏదో ఒకటి కొత్తగా ఫీల్ అయ్యే అంశాలతోనే ప్రేక్షకులు ఆకట్టుకోవాలని అతని సన్నిహితులు కూడా సలహాలు ఇస్తున్నారట. అందుకే ఆ కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ తోనే హారన్ కథను తెరపైకి తీసుకువచ్చే విధంగా చర్చలు జరుపుతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫిషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.