Begin typing your search above and press return to search.
'పక్కా కమర్షియల్' హిట్ పక్కానా?
By: Tupaki Desk | 4 Dec 2021 7:33 AM GMTగోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ను దక్కించుకుని గోపీచంద్ చాలా కాలం అయ్యింది. ఈ సినిమా ఫలితం ఆయన కెరీర్ పై ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఈ సినిమా తో హీరోగా కమర్షియల్ హిట్ ను దక్కించుకుంటే మరి కొంత కాలం పాటు గోపీచంద్ హీరోగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అందుకే సినిమా సక్సెస్ కోసం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో సినిమా కనుక కచ్చితంగా ఒక మంచి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
హీరోగా కెరీర్ ను కొనసాగించాలంటే గోపీచంద్ ఈ సినిమా తో పక్కా కమర్షియల్ హిట్ ను దక్కించుకోవాలి. మారుతి గత చిత్రాల ఫలితాలను చూస్తుంటే మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతోంది.
ఈ సినిమా ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత మారుతి చేయాలని మొదలు పెట్టాడు. కాని మద్యలో కరోనా వల్ల ఒక చిన్న సినిమాను తీశాడు.. విడుదల కూడా చేశాడు. అదే మంచి రోజులు వచ్చాయి.. ఆ సినిమా నిరాశ పర్చింది. మారుతి నుండి ఇలాంటి సినిమాను ఆశించడం లేదు అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మారుతి కూడా తాను ఇంకా జనాలను ఎంటర్ టైన్ చేసే విధంగా సినిమాను తీసి ఉండాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ సినిమా ఫలితం పక్కా కమర్షియల్ పై ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది.
మంచి రోజులు వచ్చాయి సినిమాను కేవలం నెలన్నర రోజుల్లో చిన్న బడ్జెట్ తో తీయడం జరిగింది. కనుక ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మారుతి గత చిత్రాల మాదిరిగా ఒక మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
గోపీచంద్ మరియు మారుతిలకు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. గోపీచంద్ కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కనుందట. అందుకే ఇద్దరు కూడా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.