Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: దిశా.. డీప్ వీ-నెక్

By:  Tupaki Desk   |   3 March 2019 8:58 AM GMT
ఫోటో స్టొరీ: దిశా.. డీప్ వీ-నెక్
X
దిశా పతాని ఇప్పుడు జస్ట్ బ్యూటీ కాదు.. సోషల్ మీడియాలో ఇతర బ్యూటీలకు దశదిశలాగా మారిపోయింది. అంత పెద్ద పదాలతో ఆమె గురించి వివరించడం అవసరమే. ఎందుకంటే దిశా ఇన్నర్ వేర్ అవతారాలు నెటిజనులను షాక్ కు షేక్ కు గురిచేయడంతో కుప్పలు తెప్పలుగా లైకులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఇతర బ్యూటీలు కూడా బ్రాండ్ లేబుల్స్ కన్పించేలా ఇన్నర్ వేర్ ఫోటో షూట్లు చేసూ దిశా చూపించిన దిశగా సాగిపోతున్నారు.

అయితే ప్రతి సారి ఇన్నర్ వేర్లతో నే ఫోటో షూట్ చేసే బాగుండదని అనుకుందేమో గానీ ఒక సెక్సీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోకోసం తనకు స్టైలింగ్ చేసినవారు మొహిత్ రాయ్ అని తెలిపింది. కానీ మేకప్.. హెయిర్ స్టైల్ చేసుకుంది మాత్రం తనేనట. ఈ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విషయాలు తెలిపింది. ఇక వైట్ సీరీస్ అనే హ్యాష్ టాగ్ కూడా ఇచ్చింది. అంటే ఇన్నర్ వేర్ సీరీస్ లాగా తెలుపు రంగు దుస్తులను ధరించి సీరియల్ లాగా ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట.

ఆయినా చెప్పుకోవలసింది అవన్నీ కాదు కదా. దిశా ఈ డ్రెస్ లో మహా సెక్సీగా కనిపించింది.. దానికి కారణం డీప్ వీ-నెక్ ఉండడమే. అందాల ప్రదర్శన చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు .. వారికి ఆదివారం వృధా అయిపోతుందనే ఉద్దేశం కావచ్చేమో ఎవరినీ నిరుత్సాహపరచలేదు. అందుకే ఫాలోయర్లు కూడా రెచ్చిపోయి వన్ మిలియన్ లైక్స్ కొట్టారు. ఫోటోలు పోస్ట్ చేసి ఒక రోజు కూడా గడవక ముందే ఈ రేంజ్ లైక్స్ అంటే దిశాకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ 'భరత్' లోనూ సంజయ్ దత్ 'మలంగ్' లోనూ హీరోయిన్ గా నటిస్తోంది.