Begin typing your search above and press return to search.

ఆ చిలిపి న‌వ్వులోనే దాగుంది ఏదో మాయ‌

By:  Tupaki Desk   |   11 Nov 2022 9:20 AM GMT
ఆ చిలిపి న‌వ్వులోనే దాగుంది ఏదో మాయ‌
X
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా.. మిల మిల మిల మేఘమాలా..చిటపట చినుకేయు వేళా...చెలి కులుకులు చూడగానే ..చిరు చెమటలు పోయనేలా...ఏ శిల్పి చెక్కెనీ శిల్పం..సరికొత్తగా వుంది రూపం.. కనురెప్ప వేయనీదు ఆ అందం..ఆమె అందమే చూస్తే.. మరి లేదు లేదు నిదురింకా ఆమె నన్నిలా చూస్తే.. ఎద మోయలేదు ఆ పులకింత.. తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా.. తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా!!!

'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రంలోని అంద‌మైన సాహితీ గుభాళింపు కి స‌రికొత్త అర్థంలా క‌నిపిస్తోంది జాన్వీ క‌పూర్. ఆ న‌వ్వులోనే దాగుంది ఏదో మాయ‌.. ఆ చిలిపి రూపం కుర్ర‌కారుకు గిలిగింత‌లే మ‌రి. ఎప్పుడు చూసినా చిట్టి పొట్టి నిక్క‌ర్లు.. టైట్ హ‌గ్గింగ్ దుస్తులు.. బికినీ షోలేనా? మ‌రీ జూనియ‌ర్ ఉర్ఫీ జావేద్ లా మారిందేమిటో! అంటూ ఇటీవ‌ల అభిమానులు ఎంతో క‌ల‌త చెందారు. కంటికి కునుకు క‌రువై తిండి మానేవారు.

పాపం అలాంటి వారంద‌రికీ జ‌వాబిచ్చేందుకే ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. చుడీదార్ లో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఎంతో అందంగా క‌నిపిస్తున్న జాన్వీ క‌పూర్ ఒరిజిన‌ల్ రూపం ఇదే. నిజానికి ఈ రోజుల్లో ఈఎంఐల భారం మోస్తున్న యువ‌క‌థానాయిక‌ల్లో జాన్వీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ముంబై జుహూ అర్లీ లాంటి ఖ‌రీదైన ఏరియాల్లో పాపా బోనీతో క‌లిసి అపార్ట్ మెంట్లు కొని పెట్టుబ‌డులు పెడుతుంది. దాంతో పాటు బ్యాంకు ఈఎంఐలు భారీ మొత్తంలో చెల్లిస్తోంది. అవ‌న్నీ తీర్చేందుకు నానా ప్ర‌యాస‌లు ప‌డుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో హ‌ద్దు మీరిన ఎక్స్ పోజింగులు చేస్తూ ఫోటోషూట్లు షేర్ చేయ‌డానికి కార‌ణం కూడా ఈఎంఐ భార‌మేన‌ని ఇంత‌కుముందే సెల‌విచ్చింది. ఇప్పుడు ఇన్ స్టా ఫోటోషూట్ల మాయో ఏమో కానీ త‌న‌కు వ‌చ్చే ఆదాయంతో ఈఎంఐలు చాలా సులువుగా చెల్లించేస్తున్నాన‌ని కూడా జాన్వీ ఆనందం వ్య‌క్తం చేసింది. క్లిక్కు క్లిక్కుకి డాల‌ర్లు కురుస్తుంటే మ‌న‌సంతా హాయిగా ఉంద‌ని కూడా చాలా చ‌క్కంగా చెప్పింది చిలిపి జానూ!

అందాల ఆర‌బోత‌లో ఏమాత్రం త‌గ్గ‌ని జాన్వీ క‌పూర్ కెరీర్ ప్రారంభించిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతూ ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించింది. కేవ‌లం ఇన్ స్టాలో దాదాపు 2.3 కోట్ల (20.3 మిలియ‌న్లు) ఫాలోవ‌ర్ల‌తో దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాలో తన గ్లామ్ ఇమేజ్ గురించి ర‌క‌ర‌కాలుగా చర్చ సాగుతోంది. ఇటీవ‌లి కాలంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో జాన్వీ టూమ‌చ్ గా విరుచుకుప‌డుతోంద‌నేది టాక్. సోష‌ల్ మీడియాలు త‌న‌కు వినోదం కోసం ఉప‌యోగ‌ప‌డే అడ్డాలు అని తాను చేస్తున్న ఫోటోషూట్లు స‌ర‌దా కోస‌మ‌ని కూడా ఇంత‌కుముందు చెప్ప‌క‌నే చెప్పింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవల విడుదలైన సర్వైవల్ డ్రామా మిలీలో జాన్వీ నటనకు గొప్ప ప్ర‌శంస‌లు కురిసాయి. ఈ చిత్రం పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం హెలెన్ కి అధికారిక రీమేక్ ఇది. కష్టపడి పనిచేసే యువతి మిలీగా టైటిల్ పాత్ర‌లో జాన్వీ న‌టించింది.

ప్రతిభావంతురాలైన జాన్వీ ఇప్పటికే కెరీర్ లో దూసుకుపోతోంది. కొన్ని అసాధారణమైన పాత్ర‌ల ఎంపిక‌తో అద్భుత న‌ట‌ ప్రదర్శనల‌తో మ‌న‌సులు దోచేసింది. ప్రత్యేకమైన ఎంపికలతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. రాజ్ కుమార్ రావ్ తో మళ్లీ కలిసి ప‌ని చేయ‌నుంది. అలాగే రొమాంటిక్ కామెడీ 'బవాల్‌'లో న‌టించ‌నుంది. ఈ మూవీతో తన కెరీర్ లో మొదటిసారి వరుణ్ ధావన్ తో స్క్రీన్ ను పంచుకోనుంది. త్వ‌ర‌లో టాలీవుడ్ లోను ఆరంగేట్రం చేయ‌నుంది. జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టించే ఛాన్సుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.