Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : రుక్సర్ ధిల్లాన్ మెరుపులు చూశారా..!

By:  Tupaki Desk   |   10 Dec 2022 10:06 AM GMT
ఫోటో స్టోరీ : రుక్సర్ ధిల్లాన్ మెరుపులు చూశారా..!
X
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. టాలీవుడ్ ని ఏలేద్దామనే ప్రతి ఒక్క హీరోయిన్ తెరంగేట్రం చేస్తుంది కానీ వారు ఎంచుకున్న కథలు.. చేసిన సినిమాలు వారి స్థానాన్ని నిర్ధేశిస్తాయి. టాలెంట్ ఉండి.. బ్యూటిఫుల్ గా ఉండి కూడా చాలామంది హీరోయిన్స్ వెనకపడి ఉన్నారు. వారిలో ఒకరు రుక్సర్ ధిల్లాన్. అంతకుముందు మోడల్ గా చేసిన అమ్మడు రన్ ఆంటోని అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో అక్కడ పాపులర్ అవగా తెలుగులో ఆకతాయి సినిమాలో ఛాన్స్ అందుకుంది. అందులో చూసి నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో తీసుకున్నారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

అల్లు శిరీష్ తో ఏబిసిడి సినిమా చేయగా అది కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. ఈమధ్యలో హిందీలో భంగ్రా పా లె మూవీ చేసిన రుక్సర్ విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది.

అసలైతే సినిమాలో మెయిన్ హీరోయిన్ రుక్సర్ అనిపించేలా ట్రైలర్ కట్ చేసినా సినిమాలో రుక్సర్ కేవలం కొన్ని సీన్స్ కే పరిమితమైంది. ప్రస్తుతం హిందీలో జుగాదిస్తాన్, స్పార్క్ సినిమాలో నటిస్తున్న రుక్సర్ లేటెస్ట్ గా తన ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది.

సినిమాల్లో ఎలాగు అలరించలేకపోతున్న అమ్మడు సోషల్ మీడియా ద్వారా అయినా తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా రుక్సర్ యెల్లో డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తుంది. ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్లి అక్కడ తన అందాలతో అదరగొట్టేస్తుంది అమ్మడు.

అందం అభినయం ఉన్నా సరే ఆవగింజ అంత అదృష్టం లేక రుక్సర్ ధిల్లాన్ ఇలా కెరీర్ లో వెనకపడ్డది. తెలుగులో అమ్మడికి ఒక మంచి సూపర్ హిట్ కథ పడి ఉన్నట్టైతే ఆమె రేంజ్ వేరేలా ఉండేది. ఇప్పటికీ కూడా రుక్సర్ తన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తుంది.

టాలీవుడ్ లో అమ్మడికి లక్ కలిసి రాకపోయినా హిందీలో అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. సో చూస్తుంటే రుక్సర్ ఇక బాలీవుడ్ కి పర్మినెంట్ గా షిఫ్ట్ అయ్యేలా ఉంది. తెలుగులో తను చేస్తున్న సినిమాలన్ని ఫలితాలు రివర్స్ కొడుతుంటే అమ్మడికి ఇక్కడ సరైన ఛాన్సులు రావట్లేదు. రుక్సర్ కి నెక్స్ట్ తెలుగు ఆఫర్ ఏ డైరెక్టర్ ఇస్తాడో చూడాలి. తన ఇన్ స్టాగ్రం ఫాలో అయితే మాత్రం ఆమెని తప్పకుండా సెలెక్ట్ చేస్తారని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.