Begin typing your search above and press return to search.
ఎన్నిసార్లు చంపేస్తారంటున్న కమెడియన్
By: Tupaki Desk | 23 Nov 2016 5:21 AM GMTపరిమిత సంఖ్యలో మీడియా ఉన్నప్పుడు ఇప్పుడున్నంత గందరగోళ పరిస్థితులు ఉండేవి కావు. పరిమితంగా ఉన్న మీడియాతో నిజాలు బయటకు వచ్చాయా? వారెన్ని నిజాలు చెప్పారు? లాంటి విమర్శలు ఉన్నాయి. అయితే.. పరిమితంగా మీడియా ఉన్నప్పుడు ఒక కట్టుబాటు అయితే ఉండేది కాదు. వార్తలు కాస్త ఆలస్యమైనా.. తప్పులు మాత్రం దొర్లేవి కావు. హడావుడితో.. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే పరిస్థితి ఉండేది కాదు. అన్నింటికి మించి ప్రముఖుల్ని పదే పదే చంపేసే (మరణించారన్న వార్తలతో) ధోరణి అస్సలు ఉండేది కాదు.
ఎప్పుడైతే టీవీ ఛానళ్లు రంగ ప్రవేశం చేశాయో అప్పటి నుంచి వార్తలు అందించే క్రమంలో వేగం పెరిగింది. ఆ వేగానికి మరింత ఆసక్తికర సమాచారం ఇవ్వాలన్న తొందరలో ఇష్టం వచ్చినట్లుగా కథనాల్ని మలిచేసే ధోరణి పెరిగింది. ఈ హడావుడితో కొందరు ప్రముఖుల్ని చనిపోకుండానే చంపేసిన పరిస్థితి. ఇదే ఇబ్బందిగా మారితే.. కొద్దికాలంగా వచ్చి పడిన సోషల్ మీడియా సునామీ పుణ్యమా అని ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి వార్త బయటకు వస్తుందో అర్థం కాదు. కొన్ని విషయాలు ఎంతవాస్తవంగా ఉంటాయో.. అంతే అవాస్తవంగా ఉడే వార్తలు బోలెడన్ని ఉంటున్నాయి.
దీంతో.. సోషల్ మీడియాలో వార్తలు అంటే.. ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకునే దుస్థితి. తాజాగా ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు గౌండమణిని సోషల్ మీడియా తన వార్తలతో చంపేసింది. నిక్షేపంగా ఆయన ఉన్నప్పటికీ.. ఆయనకు అనారోగ్యాన్ని అపాదించేసి.. ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇదే తరహాలో ఆయన చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు పుట్టటం.. తర్వాత ఆయన నెత్తి నోరుకొట్టుకొని తాను బతికి ఉన్నట్లుగా చెప్పుకునే వారు. దీంతో.. విసిగిపోయిన ఆయన.. తాజాగా తాను మరణించినట్లుగా వస్తున్న వార్తలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
గడిచిన మూడు రోజులుగా కొంతమంది పని కట్టుకొని మరీ తానుచనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. ఇది ఏ మాత్రం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గౌండమణి. ఈ పుకార్లను నమ్మేసిన కొన్ని ఛానళ్లు.. ఈ వార్తల్ని ప్రసారం చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో తన న్యాయవాదిని వెంటబెట్టుకొని చెన్నై పోలీస్ కమిషనర్ ను కలిసిన ఆయన.. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తాను చనిపోయినట్లుగా వస్తున్న వార్తలకుఅడ్డుకట్ట వేయాలని కోరారు. సోషల్ మీడియా సంగతేమో కానీ.. ప్రముఖలకు మాత్రం చిత్రవిచిత్రమైన కష్టాలు ఎదురవుతున్నాయనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/