Begin typing your search above and press return to search.
చైతూ సినిమా.. ఓ సరికొత్త ప్రయోగం
By: Tupaki Desk | 22 Aug 2015 2:07 PM GMTఓ హిట్టు సినిమాకు సీక్వెల్ తీయడం చూశాం. కథ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే రెండో భాగంలో సినిమాను కొనసాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. ఐతే కొందరు ఊరికే పేరు మాత్రమే వాడుకుని.. రెండో భాగంలో కొత్త కథతో సినిమాలు తీస్తుంటారు. ఈ రెంటికీ భిన్నంగా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు గౌతమ్ మీనన్. ప్రస్తుతం ఆయన తమిళంలో శింబుతో, తెలుగులో నాగచైతన్యతో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఇదే హీరోలతో ఏమాయ చేసావె సినిమాను రెండు భాషల్లో వేర్వేరుగా తెరకెక్కించాడు గౌతమ్. ఆ సినిమాకు.. ఇప్పుడు తీస్తున్న సినిమాకు ఓ ఆసక్తికరమైన లింక్ ఉంది. ప్రస్తుత సినిమా ‘ఏ మాయ చేసావె’కి సీక్వెల్ కాని సీక్వెల్.
ఏమాయ చేసావెలో హీరో పాత్రధారి పేరు కార్తీక్. అతను జెస్సీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. ఆమె అతణ్ని వదిలేసి వెళ్లిపోతుంది. ఇతను డైరెక్టర్ అవుతాడు. మళ్లీ జెస్సీని కలుస్తాడు. ఐతే ఇదే కార్తీక్ పాత్రధారి జీవితంలోకి జెస్సీ అనే అమ్మాయి రాకపోయి ఉంటే.. అతను డైరెక్షన్ లోకి వెళ్లకపోయి ఉంటే.. అతడి జీవితంలోకి వేరే అమ్మాయి వస్తే.. అతడికి వేరే సమస్యలు ఎదురైతే ఏం జరిగేది అనే కథాంశంతో కొత్త సినిమా తీస్తున్నట్లు వెల్లడించాడు గౌతమ్. ఏమాయ చేసావెలో రొమాంటిక్ లవ్ స్టోరీ చూపించానని.. ఇందులో యాక్షన్ కు పెద్ద పీట వేశానని గౌతమ్ వెల్లడించాడు. సినిమాల్లో సాధారణంగా హీరో పది మందిని కొట్టేస్తుంటాడని.. ఐతే అలా కాకుండా ఓ సామాన్యుడు మామూలుగా తన మీదికి ఎవరైనా కత్తితో దాడి చేయడానికి వస్తే ఎలా స్పందిస్తాడు? ఒక పెద్ద సమస్య ఎదురైతే ఎలా దాన్ని ఎదుర్కొంటాడు? అనే అంశాలతో రియలిస్టిక్ గా ఈ సినిమా ఉంటుందని గౌతమ్ వెల్లడించాడు. తమిళ, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుందని గౌతమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.