Begin typing your search above and press return to search.

24 గంటలు నిజంగా వర్కవుట్ అవుతుందా ?

By:  Tupaki Desk   |   8 Jun 2019 7:09 AM GMT
24 గంటలు నిజంగా వర్కవుట్ అవుతుందా ?
X
కోలీవుడ్ లో కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఇరవై నాలుగు గంటల సినిమాల ప్రదర్శనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇష్టం వచ్చినప్పుడు ఎలా కావాలంటే అలా షోలు వేసుకునే వెసులుబాటు ఉండబోతోందన్న మాట. దీని మీద మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉన్న నాలుగు ఆటలకే జనంతో ఎలా నింపాలో అర్థం కాక థియేటర్ల యజమానులు తలలు పట్టుకుని ఉంటే ఇప్పుడీ రోజు మొత్తం షోలు ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది కేవలం స్టార్ హీరోలకు బెనిఫిట్ కలిగించేందుకు తీసుకున్న నిర్ణయమని అంతేతప్ప వీటి వల్ల చిన్న మరియు మీడియం రేంజ్ మూవీస్ కి నయా పైసా ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. రజనికాంత్ విజయ్ అజిత్ లాంటి వాళ్ళ సినిమాలు తెల్లవార్లూ వేసినా జనం వస్తారు. అంతగా ఇమేజ్ లేని హీరోలైతే సెకండ్ షోకే చిల్లర లెక్కబెట్టుకునే పరిస్థితి ఉంది దీన్ని ఓ ఆరు నెలల పాటు పరిశీలించి అప్పుడు విశ్లేషించే ఆలోచనలో ఉన్నారు నిపుణులు.

ఒకవేళ ఖచ్చితంగా వర్క్ అవుట్ అయితే హైదరాబాద్ బెంగుళూరు లాంటి ఇతర రాష్ట్రాల కీలక నగరాల్లో ఇలాంటి పద్ధతి తీసుకొచ్చే ఆలోచన చేసే అవకాశం లేకపోలేదు. అర్ధరాత్రి దాటితే కంటి మీద కునుకును కంట్రోల్ చేసుకోలేని సగటు భారతీయుడు ఇలా రొజు లేట్ నైట్ షోలను ఆదరించడం అనుమానమే. పైగా వీకెండ్ అంటే ఏదోఒకరకంగా ఆడించుకోవచ్చు కాని వీక్ డేస్ లో ఇవి నడపటం సవాలే. ప్రభుత్వం మాత్రం అన్నేసి షోలు నిబంధన కాదని ఒకవేళ వేసుకోవాలని అనుకుంటే అనుమతుల పరంగా ఉన్న ఇబ్బందులు మాత్రమే దీని ద్వారా తొలగుతాయని స్పష్టం చేస్తోంది