Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోల కోసమే రూల్స్ చేంజ్ చేశారా...?

By:  Tupaki Desk   |   12 Jun 2020 11:30 PM GMT
సీనియర్ హీరోల కోసమే రూల్స్ చేంజ్ చేశారా...?
X
గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులను నిబంధనలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జూన్ 15 నుండి సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని జీవోలు జారీ చేసాయి. తెలంగాణా ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధలు అనుగుణంగా మాత్రమే షూటింగ్స్ చేసుకోవాలని అనుమతులు జారీ చేశాయి. అయితే ఈ నిబంధనలలో 10 ఏళ్ళ లోపు పిల్లలు మరియు 60 ఏళ్ళ పై బడిన వారు షూటింగ్ లో పాల్గొనాలంటే మెడికల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో 60కి పైగా వయసు ఉన్నవాళ్లు షూటింగ్స్‌ కు అనుమతింపబడరు అని నిబంధనలలో పేర్కొన్నాయి. అలానే కొన్ని రాష్ట్రాలు 8 సంవత్సరాల లోపు వారు.. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు ఇంటి నుంచి బయటికి రావద్దనే నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. కానీ టాలీవుడ్‌ కి సంబంధించి అలాంటి నిబంధనలు లేకపోవడం విశేషం.

ఇదిలా ఉండగా కేవలం స్టార్ హీరోల కోసమే నిబంధనలలో 60 ఏళ్ళ పైబడిన వారు మెడికల్ అధికారుల అనుమతితో షూటింగ్ లో పాల్గొనవచ్చని పేర్కొన్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ 60కి దగ్గరగా 60 క్రాస్ అయ్యి ఉన్నారు. ఇక స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కూడా ఈ జాబితాలోకే వస్తారు. వెంకటేష్ కూడా ఈ ఏడాదే 60వ పడిలోకి చేరుతాడు. అందుకే టాలీవుడ్‌ కి ఈ నిబంధనలు వర్తించవు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అలాంటి రూల్స్ చేర్చి ఉంటే ఇప్పట్లో షూటింగ్స్ జరగడం కష్టమే అంటున్నారు. నిజానికి వారి వయసు 60 చుట్టూ తిరుగుతున్నా కూడా యంగ్ హీరోలకు ఏ విషయంలోనూ వెనుకాడటం లేదని.. డ్యాన్స్‌లు, ఫైట్స్.. రొమాన్స్ ఇలా ఏదైనా సరే.. చేయడానికి రెడీ అనేస్తున్నారు. అలాంటప్పుడు షష్టిపూర్తి హీరోలు షూటింగులతో పాల్గొనకూడదని నిబంధనలు అవసరం లేదని.. టాలీవుడ్‌ స్టార్ హీరోలకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని వారు కామెంట్ చేస్తున్నారు.