Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బాలీవుడ్ లో హీరో నెంబ‌ర్-1

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:30 AM GMT
మ‌ళ్లీ బాలీవుడ్ లో హీరో నెంబ‌ర్-1
X
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు గోవింద పాతికేళ్ల క్రితం న‌టించిన `హీరో నెంబ‌ర్-1` అప్ప‌ట్లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. గోవింద‌కు ఈ సినిమా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. గోవింద మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన సినిమా ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం మెప్పించింది. ఇందులో క‌రీష్మా క‌పూర్ హీరోయిన్ గా న‌టించింది.

ఈ సినిమా డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే స‌రిగ్గా ఇప్పుడిదే టైటిల్ తో టైగ‌ర్ ష్రాఫ్ సినిమాచేయ‌డానికి రెడీ అవుతున్నాడు. హీరో నెంబ‌ర్ 1 టైటిల్ తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్ తో మునుపెన్న‌డు రాని అతి భారీ యాక్ష‌న్ సీక్వెన్స్తో ఈచిత్రాన్ని వ‌సు భ‌గ్నాని..జాకీ భ‌గ్నాని నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ శ‌క్తి ని ఈ ప్రాజెక్ట్ కి ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేసారు. అయితే `హీరో నెంబ‌ర్ వ‌న్` టైటిల్ పెట్టి సినిమా చేయ‌డం క‌రెక్టేనా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ టైటిల్ కి టైగ‌ర్ ప‌క్కాగా స‌రిపోతాడ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక్క‌డ మ‌రో ప్ర‌త్యేక‌త కూడా ఉంది.

ఈ సినిమా అంత‌ర్జాతీయ స్థాయికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారుట‌. దీనిలో భాగంగా ఎక్కువ భాగం షూటింగ్ యూర‌ప్ లోనే ఉంటుంద‌ని స‌మాచారం. కొన్ని స‌న్నివేశాల కోస‌మే ముంబైలో షూటింగ్ నిర్వ‌హించ‌నున్నారుట‌. అలాగే ఈ సినిమా కోసం అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణుల్ని దించుతున్నారుట‌. అందుకోసం జ‌గ‌న్ శ‌క్తి ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఫీల్ని అందించాలి అన్న ఉద్దేశంతోనే సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టైగ‌ర్ ష్రాఫ్ యాక్ష‌న్ ఎన‌ర్జీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా మారిపోయాడు. కెర‌ర్ ఆరంభం నుంచి ఒకే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఆ ఎన‌ర్జీని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ సైతం ఆ త‌ర‌హా క‌థ‌లే ఎక్కువ‌గా సిద్దం చేస్తున్నారు. ఇప్ప‌టికే టైగ‌ర్ న‌టిస్తోన్న చిత్రాలు..అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ లు అన్ని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాలుగానే క‌నిపిస్తున్నాయి.