Begin typing your search above and press return to search.

చరణ్‌ తో చర్చలు జరిపి సుమంత్‌ తో సినిమా ఏంటీ డైరెక్టర్‌ గారు?

By:  Tupaki Desk   |   18 April 2021 4:30 AM GMT
చరణ్‌ తో చర్చలు జరిపి సుమంత్‌ తో సినిమా ఏంటీ డైరెక్టర్‌ గారు?
X
నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాకు ఇటీవల జాతీయ అవార్డు దక్కిన విషయం తెల్సిందే. సాదారణంగా జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకుడితో స్టార్‌ హీరోలు వర్క్‌ చేసేందుకు క్యూ కడతారు. కాని జెర్సీ దర్శకుడి విషయంలో మాత్రం అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. జెర్సీ సినిమా ను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి మరో రెండు మూడు నెలల్లో ఆ రీమేక్‌ ను పూర్తి చేయబోతున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం టాలీవుడ్‌ లో తన తదుపరి సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి సినిమా విషయలంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది.

అక్కినేని హీరో సుమంత్‌ తో గౌతమ్‌ తిన్ననూరి సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాను దీపావళి సందర్బంగా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జెర్సీ రీమేక్‌ పనితో పాటు సుమంత్ తో సినిమాకు స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడట. జెర్సీ రీమేక్ పూర్తి అయిన వెంటనే మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తో గౌతమ్ తిన్ననూరి ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఆమద్య తెగ వార్తలు వచ్చాయి. చరణ్‌ కు రెండు మూడు కథలను గౌతమ్‌ వినిపించాడని ఒక స్పోర్ట్స్ డ్రామా కు చరణ్‌ ఓకే చెప్పాడని కూడా ప్రచారం జరిగింది. కాని చరణ్‌ తో కాకుండా సుమంత్‌ తో గౌతమ్ సినిమాను చేయబోతుండటం ఆశ్చర్యంగా ఉంది.

గౌతమ్‌ అడిగితే చరణ్‌ కాకున్నా పలువురు హీరోలు డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కాని ఆయన మాత్రం తన వద్ద ఉన్న స్క్రిప్ట్‌ కు సుమంత్‌ అయితే న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో ఆయనతో వర్క్‌ చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది. సుమంత్‌ తో సినిమా చేసిన తర్వాత అయినా చరణ్‌ తో సినిమాను ఈ దర్శకుడు చేస్తాడా లేదా అనేది చూడాలి. అయినా చరణ్‌ వంటి స్టార్‌ సినిమా చేసేందుకు ఓకే చెప్పినప్పుడు కాస్త వెయిట్ చేయకుండా గ్యాప్‌ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో చిన్న హీరోతో సినిమా చేయడం వల్ల ఫలితం కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. సుమంత్‌ తో చేయబోతున్న సినిమా పై నమ్మకం ఉండటం వల్ల గౌతమ్ ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కనుక సక్సెస్‌ అయితే ఈసారి చరణ్ ఆలస్యం చేయకుండా అవకాశం ఇచ్చేయ వచ్చు అంటున్నారు.