Begin typing your search above and press return to search.
జెర్సీ దర్శకుడికి రెస్ట్ కావాలట
By: Tupaki Desk | 21 April 2019 5:30 PM GMTఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారిన నాని జెర్సీ దర్శకుడు గౌతం తిన్ననూరి చాలా రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నాడు. సాధారణంగా ఫార్ములాకు కట్టుబడే సినిమాలు అధికంగా వచ్చే టాలీవుడ్ లో నాని లాంటి స్టార్ హీరోతో జెర్సి లాంటి సబ్జెక్టుని ట్రై చేయడం చాలా రిస్క్. షూటింగ్ జరుగుతున్న టైంలో నాని అంత ధైర్యంగా తాను లేనని గౌతం ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాన్ని బట్టే ఇది ఎంత టెన్షన్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే గౌతం నెక్స్ట్ మూవీ ఏంటి అనే దాని గురించి అప్పుడే ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. కొందరు స్టార్ హీరోలు అప్పుడే కాల్ చేసి కథలు అడిగారని సిద్ధంగా ఉంటె డేట్స్ కూడా ఇస్తామని చెప్పారని ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దాని గురించిన క్లారిటీ గౌతం స్వయంగా ఇచ్చేశాడు
దాని ప్రకారం గౌతం మూడో సినిమా ఎవరికీ కమిట్ కాలేదు. తన దగ్గర చాలా కథలు ఉన్నాయని కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత ఎవరితో తీయాలనే ప్లానింగ్ చేసుకుంటానని చెబుతున్నాడు. సో స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయి వాటికి తగ్గ హీరోలు దొరకడమే ఆలస్యం. అయితే చేసిన రెండు సినిమాల్లోనూ సున్నితమైన భావోద్వేగాలు ఎంచుకున్న గౌతం మూడో సినిమాను కూడా అదే పంధాలో తెరకెక్కిస్తాడా లేక కొత్తగా వేరే జానర్ ట్రై చేస్తాడా అనేది ఆలోచించాల్సి ఉంది. సో దీనికి సంబందించిన క్లారిటీ రావాలంటే ఇంకో రెండు మూడు నెలలైనా ఆగాల్సి వచ్చేలా ఉంది