Begin typing your search above and press return to search.
'జెర్సీ' ని ఎవరూ ఒప్పుకోరని పక్కన పెట్టాడట
By: Tupaki Desk | 22 April 2019 1:30 AM GMTజెర్సీ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనూ ఇది చర్చనీయాంశంగా మారిందని అనొచ్చు. వేరే భాషల వాళ్లు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ఆవల కూడా ‘జెర్సీ’ సత్తా చాటుతోంది. తెలుగులో వచ్చిన అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనడంలో మరో మాట లేదు. దర్శకుడిగా ఒకే సినిమా అనుభవం ఉన్న గౌతమ్ తిన్ననూరి.. కెరీర్ ఆరంభంలోనే ఇంత గొప్ప సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఐతే ఇది రెండో సినిమాగా కాదు.. మొదటి సినిమాగానే తీయాలన్నది అతడి ఆలోచన అట. తాను ముందుగా రాసిన కథ కూడా ఇదే అంటున్నాడతను. కానీ ఈ సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రారేమో అన్న సందేహంతో తానే దాన్ని పక్కన పెట్టేసినట్లు గౌతమ్ వెల్లడించాడు.
తన ‘జెర్సీ’ - ‘మళ్ళీ రావా’తో పాటు వేరే కథలు కూడా ఇంతకుముందు ఉన్నాయని.. ఐతే అన్నింట్లోకి నచ్చిన కథ మాత్రం ‘జెర్సీ’నే అని గౌతమ్ తెలిపాడు. ఈ సినిమాతోనే అరంగేట్రం చేద్దామా అని ఒక దశలో అనిపించినప్పటికీ.. తొలి ప్రయత్నంలోనే ఇలాంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తీస్తానంటే తనను నమ్మి ఎవరూ ముందుకు రారేమో అన్న సందేహంతో దీన్ని పక్కన పెట్టానన్నాడు. కనీసం ఎవరికీ ఆ కథ కూడా చెప్పలేదని తెలిపాడు. అనుకోకుండా ‘మళ్ళీ రావా’ చేసే అవకాశం వచ్చి తనేంటో రుజువు చేసుకోవడంతో నమ్మకం వచ్చిందని.. ఆలస్యం చేయకుండా ‘జెర్సీ’ని బయటికి తీసి నానికి చెప్పానని.. ఆయన మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడని గౌతమ్ తెలిపాడు. ‘జెర్సీ’ని తనకంటే నాని ఎక్కువగా నమ్మాడని.. ఆయన కాన్ఫిడెన్స్ చూసి తనకు భయం వేసిందని గౌతమ్ తెలిపాడు.