Begin typing your search above and press return to search.
అక్కడ ఖైదీ ‘కలెక్షన్ల’ను దాటేసిన శాతకర్ణి
By: Tupaki Desk | 15 Jan 2017 11:37 AM GMTపోటాపోటీగా ఇద్దరు అగ్రహీరోలకు సంబంధించిన మైల్ స్టోన్ చిత్రాలు ఒక రోజు తేడాతో విడుదల కావటం ఈ మధ్య కాలంలో ఇదేనని చెప్పాలి. దీంతో.. హీరోల ముచ్చట ఎలా ఉన్నా.. అభిమానుల మధ్య పోటీ ఎంత ఎక్కువగా ఉందంటే.. ఇద్దరు హీరోల అభిమానులు ఈ చిత్రాల్ని పర్సనల్ గా తీసుకున్నారని చెప్పాలి. పండగ హడావుడిని సైతం పట్టించుకోకుండా.. ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకున్న మాటలు.. వాట్సప్ లో సాగుతున్న మెసేజ్ ల జోరు అంతాఇంతా కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ అభిమాన నటుడి చిత్రం ఎంతగా దూసుకెళుతుందో చెప్పుకోవటానికి వీలుగా.. ఎవరికి వారు వసూళ్ల లెక్కల్ని తమ వాదనకు అసరాగా చేసుకుంటున్నారు. సంక్రాంతి బరిలోకి దిగిన మొదటి పందెం కోడిగా చిరు ఖైదీ నిలిచింది. మిగిలిన సినిమాల కంటే ముందుగా విడుదలైన ఈ సినిమా తొలి రోజునే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది.
తర్వాతి రోజు విడుదలైన శాతకర్ణికి థియేటర్లు తక్కువగా ఉండటం.. అప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఖైదీ హడావుడిలో శాతకర్ణి జోరు పెద్దగా కనిపించలేదు. అయితే.. శాతకర్ణి షో ఒక్కొక్కటి ముగిసే కొద్దీ మౌత్ టాక్ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. రోజు మారే సరికి... శాతకర్ణి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. తొలిరోజు రికార్డు కలెక్షన్లను ఖైదీ సొంతం చేసుకుంది. అయితే.. సంక్రాంతి రోజున ఖైదీ.. శాతకర్ణి రెండు సినిమాల కలెక్షన్లను కొత్త లెక్కల్ని తెర మీదకు తీసుకొచ్చాయి. అమెరికాలో ఈ రెండు సినిమాలు సంక్రాంతి రోజున కొల్లగొట్టిన వసూళ్లు చూస్తే.. ఖైదీని శాతకర్ణి అధిగమించిన వైనం కనిపిస్తుంది. సంక్రాంతి రోజు ఖైదీకి 45వేల డాలర్ల(సుమారు రూ.30.65లక్షలు) కలెక్షన్లు రాగా.. శాతకర్ణికి 49వేల డాలర్లు (సుమారు రూ.33.40లక్షలు) వచ్చినట్లుగా తేలింది. డాలర్ల లెక్కలో చెప్పాలంటే ఖైదీ కంటే శాతకర్ణి నాలుగువేల డాలర్లు అధికంగా రాబట్టినట్లుగా చెబుతున్నారు. మరీ.. లెక్కల విశ్వసనీయత తేలాలంటే అధికారిక కలెక్షన్లు వెల్లడైతే కానీ చెప్పలేమని చెప్పాలి.