Begin typing your search above and press return to search.

బుల్లితెర‌పై వేయాలంటే 218 క‌ట్స్‌

By:  Tupaki Desk   |   29 Sep 2015 4:49 AM GMT
బుల్లితెర‌పై వేయాలంటే 218 క‌ట్స్‌
X
బాలీవుడ్‌ లో రికార్డ్ వ‌సూళ్ల‌ను సాధించిన అడ‌ల్ట్ సెక్స్ కామెడీ గ్రాండ్ మ‌స్తీ. కేవ‌లం 21 రోజుల్లో 100 కోట్లు వ‌సూళ్లు సాధించిన చిత్ర‌మిది. ఆఫ్తాబ్ శివ‌దాసాని - రితేష్ దేశ్‌ ముఖ్‌ - వివేక్ ఒబేరాయ్ హీరోలుగా న‌టించిన చిత్ర‌మిది. ఐదుగురు హీరోయిన్లు తెర నిండుగా క‌న్నుల పండువ చేశారు. యూత్ ఈ అడ‌ల్ట్ కామెడీని పిచ్చిగా ఆద‌రించారు. అమెరిక‌న్ పైస్ రేంజులో ఉంటుందీ సినిమా అని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అందుకే ఈ సినిమాని బుల్లితెర‌పై రిలీజ్ చేయ‌డాన్ని అడ్డుకున్నారు.

ఇలాంటి న్యూడ్ సినిమాలు టీవీల్లో వేస్తే పిల్ల‌లంతా చెడిపోతార‌ని అభియోగం మోపుతూ ఢిల్లీ హైకోర్ట్‌ లో పిల్ వేశారు. దాంతో కోర్టు ఆదేశాల మేర‌కు ఈ సినిమాని బుల్లితెర‌పై ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆపేశారు. ప్ర‌స్తుతం కోర్టు ప‌రిశీల‌న‌లో ఉందీ సినిమా. ఒక‌వేళ ఈ సినిమాని బుల్లితెర‌పై వేయాలంటే దాదాపు 218 క‌ట్స్ వేయాల్సిందేన‌న‌ని సెన్సార్ బోర్డ్ నిర్ణ‌యించింది. 135 నిమిషాల సినిమాని కేవ‌లం 98నిమిషాల‌కు కుదించింది సెన్సార్‌ బోర్డ్‌.

గ్రాండ్ మ‌స్తీ స‌క్సెస్ ఇచ్చిన ఇన్‌ స్పిరేష‌న్‌ తో ఆ త‌ర్వాత బోలెడ‌న్ని అడ‌ల్ట్ కామెడీలు తెర‌కెక్కాయి. అయితే ఇవేవీ థియేట‌ర్ ల‌లో రిలీజ్‌ కి కూడా నోచుకోకుండా మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. స‌న్నీలియోన్ న‌టించిన మ‌స్తీ జాదే రిలీజ్ విష‌యంలో ఇప్ప‌టికీ క్లియ‌రెన్స్ లేదు. ఈ జోన‌ర్‌ లో బ‌తికి బైట‌ప‌డిన సినిమా గ్రాండ్ మ‌స్తీ ఒక్క‌టే.