Begin typing your search above and press return to search.

బోల్డ్ బేబీకి ఊహించని ఘన స్వాగతం

By:  Tupaki Desk   |   21 Dec 2020 2:00 PM GMT
బోల్డ్ బేబీకి ఊహించని ఘన స్వాగతం
X
తెలుగు బిగ్‌ బాస్ లోకి బోల్డ్‌ అంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ అనూహ్యంగా టాప్‌ 5 లో నిలిచింది. ఫినాలే ఎపిసోడ్‌ లో నెం.4 గా నిలిచింది. బిగ్‌ బాస్‌ లో బోల్డ్‌ గా మాట్లాడటంతో పాటు తనకు నచ్చినట్లుగా ఉన్న వ్యక్తి అంటే అరియానా అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను అనుకున్నట్లుగా ప్రవర్తించడంతో పాటు.. కెప్టెన్‌ అయిన సమయంలో ప్రతి ఒక్కరిని తన కండీషన్స్ కు తగ్గట్లుగా నడుచుకోవాలంటూ సూచించింది. ఎక్కడ కూడా సేఫ్‌ గేమ్‌ ఆడని అరియానా కు బయట మంచి మద్దతే ఉంది. కాని ఆమె బయటకు వచ్చిన తర్వాత దక్కిన వెల్‌ కం ఆమెకే షాకింగ్‌ అనిపించింది.

బిగ్ బాస్‌ ఆదివారం ఎపిసోడ్‌ పూర్తి అయిన తర్వాత అరియానా ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితులు పక్కింటి వారు అంతా కూడా ఘన స్వాగతం పలికారు. పార్టీ ఏర్పాటు చేసి తీన్ మార్ డాన్స్‌ లు చేశారు. అవినాష్ ఈ వెల్‌ కమ్‌ పార్టీకి ముఖ్య అతిథిగా హాజరై అరియానాతో కేక్‌ కట్‌ చేయించాడు. టాప్‌ 5 కి మంచి స్వాగతం దక్కింది. కాని అరియానాకు మాత్రం అంతకు మించి అనడంలో సందేహం లేదు.

ఆమెను చిరంజీవి కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. అందుకే ఆమెకు అందరు కూడా ఘన స్వాగతం పలికారు. కింద మీద ఊపు అరియానా తోపు... అరియానా అరియానా నీతో పెట్టుకుంటే అందరికి తందాన.. బోల్డ్‌ బ్యూటీ.. గోల్డ్ బ్యూటీ అంటూ బోల్డ్‌ బేబీకి అద్బుతమైన ఘన స్వాగతం దక్కింది. ఆ స్వాగతంకు అరియాన కూడా ఎమోషనల్‌ అయ్యింది.