Begin typing your search above and press return to search.

విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆర్నెల్లుగా వెయిటింగ్

By:  Tupaki Desk   |   4 Oct 2017 11:54 AM GMT
విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆర్నెల్లుగా వెయిటింగ్
X
వినవయ్య రామయ్య తో హీరో డెబ్యూ ఇచ్చిన నాగ అన్వేష్ మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోవడానికి ఏంజెల్ అనే సోషియో ఫాంటసీ మూవీలో నటించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంతో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. కెరీర్ లో తొలిసారిగా హెబ్బా ఓ గంధర్వ రాకుమారి పాత్రలో కనిపించబోతుంది. బాహుబలి చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తమిళ దర్శకుడు పళని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. బెంగాల్ టైగర్ - నక్షత్రం ఫేమ్ భీమ్స్ సిసోరిలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఫుల్ రైజింగ్ లో ఉండి ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హెబ్బాపటేల్ నుంచి రాబోతున్న ఏకైక తెలుగు చిత్రం ఏంజెల్ మాత్రమే, దీంతో ఈ సినిమా పై హెబ్బా ఫుల్ హోప్స్ పెట్టుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తరువాత తన కెరీర్ మళ్లీ పుంజుకుంటుందని హెబ్బా భావిస్తున్నట్లు సమాచారం. అయితే సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఈ చిత్రంలో దాదాపు 45 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్ సీన్స్ ఉన్నాయట, దీంతో ఈ సిజీ వర్క్ కోసమే సినిమా చిత్రీకరణ ముగిసి ఆర్నెల్లు పైనే అవుతున్నా రిలీజ్ చేయడం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ ఓ కొలిక్కి వచ్చాయట, దీంతో నవంబర్ 3న ఏంజెల్ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లుగా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మరి తనతో నటించిన అప్ కమింగ్ హీరోలందరికీ అదృష్ట దేవతగా మారిన హెబ్బా ఈసారి ఏంజెల్ గా నాగా అన్వేష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.