Begin typing your search above and press return to search.
ఒక్క లీక్.. 100 కోట్లకు దెబ్బ
By: Tupaki Desk | 16 July 2016 5:30 PM GMTఇప్పటిదాకా పైరసీ భూతం అనేక సినిమాలపై దెబ్బ కొట్టింది. కానీ దాని అసలు విశ్వరూపం ఎలా ఉంటుందో చూసిన సినిమా మాత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీ. ఇంతలా చెప్పుకోవడానికి కారణం.. ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్.
మస్తీ సిరీస్ లో వచ్చిన తొలి రెండు సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీపై కూడా చాలానే అంచనాలున్నాయి. కంటెంట్ గొప్పగా లేకున్నా వంద కోట్ల వసూళ్లు ఖాయమే అనుకున్నారంతే. ఇందుకు కారణం గత రెండు సినిమాలు సాధించిన సక్సెస్. కానీ జూలై 22న విడుదల కావాల్సిన ఈ మూవీ.. 17 రోజుల ముందే ఆన్ లైన్ లో లీక్ అయింది. దీంతో రిలీజ్ డేట్ ను ఓ వారం ముందుకు జరిపారు. ఇది కూడా సినిమాను కాపాడలేకపోయింది. మొదటి రోజున గ్రేట్ గ్రాండ్ మస్తీకి వచ్చిన వసూళ్లు కేవలం 2 కోట్లు.
ఆన్ లైన్ లో లీక్ కావడంతో తమకు వంద కోట్ల నష్టం వచ్చిందంటున్నారు గ్రేట్ గ్రాండ్ మస్తీ నిర్మాతలు. డీవీడీలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకున్నా.. సైబర్ క్రైమ్ పై ఏం చేయలేని సిట్యుయేషన్. కానీ ఒక్క లీక్ తో వంద కోట్ల నష్టాలను ఎదుర్కుని.. పూర్తిగా వాషౌట్ అయిపోయిన పరిస్థితి గ్రేట్ గ్రాండ్ మస్తీకే వచ్చింది. ఉడ్తాపంజాబ్ - సుల్తాన్ లు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్నా.. ఉడ్తాపంజాబ్ మరీ ఇంతగా నష్టపోలేదు. ఇక సుల్తాన్ అయితే బాక్సాఫీస్ ని దున్నేస్తున్న సంగతి తెలిసిందే.