Begin typing your search above and press return to search.
ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్టే మారాలన్న గ్రీక్ గాడ్
By: Tupaki Desk | 1 Oct 2022 6:45 AM GMTఓటీటీల రాకతో సినీపరిశ్రమకు లాభాలతో పాటు నష్టాలు తప్పడం లేదు. నిర్మాతకు ఓటీటీల నుంచి గ్యారెంటీ ఆదాయం ఉన్నా కానీ.. ప్రజలు ఒకసారి ఓటీటీకి అలవాటు పడిన తర్వాత థియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమాలను పరిమితంగా ఎంచుకుంటున్నారన్నది కాదనలేని నిజం. 3డి సినిమాలు.. కంటెంట్ ఉన్న భారీ చిత్రాల కోసం మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు ఎంచుకుంటున్నారు. సినిమా మంచి హిట్టు టాక్ తో రన్ అయితేనే థియేటర్లకు వెళుతున్నారు. ఇతర సినిమాలన్నీ ఓటీటీలోనే చూడాలనుకుంటున్నారు. ప్రజల మైండ్ సెట్ అలా అసాధారణంగా మారుతుందని నిర్మాతలు ఊహించలేదు. పర్యవసానం ఓటీటీలు బిగ్ పంచ్ విసిరినట్టయ్యింది. అందుకే ఇటీవల టాలీవుడ్ లో ఎనిమిది వారాల విండో అంటూ నిర్మాతలు ఛాంబర్ సమావేశంలో హడావుడి చేసారు.
ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో ఓటీటీలపై విరుచుకుపడ్డారు. అతడు నటించిన విక్రమ్ వేద ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హృతిక్- సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఫర్వాలేదనే స్పందనలు అందుకుంది.
ఇటీవల ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హృతిక్ ని రెండు ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒకటి బాలీవుడ్‌లో సౌత్ కంటెంట్ ఆధిపత్యం గురించి కాగా... మరొకటి ప్రేక్షకులలో ఓటీటీ సంస్కృతి విజృంభణ గురించి ప్రశ్నించారు. దానికి హృతిక్ చాలా తెలివిగా మాట్లాడుతూ తనకు సౌత్ సినిమా.. నార్త్ సినిమా అనే తేడా లేదని భారతీయ సినిమా అనే ఒకే ఒక్క సినిమా ఇండస్ట్రీ ఉందని చెప్పాడు.
ఓటీటీ సంస్కృతిపై మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు అన్ని రకాల సినిమాలను వీక్షించాలనుకోవడం మంచి పరిణామమని అన్నారు. ఈ ఎక్స్‌పోజర్ కారణంగా మన ప్రేక్షకుల అభిరుచి మెరుగుపడటం గొప్ప విషయం. మేము వారి కొత్త అభిరుచులకు అనుగుణంగా ఉండాలి. వారిని సంతృప్తి పరిచే కంటెంట్ తో మనం ముందుకు రాలేకపోతే మా ముఖాలపై గట్టి పంచ్ లు పడేందుకు మేం అర్హులం.. అంటూ నిజాయితీగా మాట్లాడారు.
ఓటీటీ వేదికల్లో వీక్షకులు చూసే నాణ్యమైన కంటెంట్ కు సరిపోయే చిత్రాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మన దేశంలోని మోడ్రన్ యుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దర్శకనిర్మాతలు.. రచయితలు నటులు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కూడా ఆయన సూచించారు. చాలా మంది హృతిక్ అభిప్రాయాలను అభినందిస్తున్నారు. భవిష్యత్తులో బలమైన వినోదాత్మక కంటెంట్ తో పటిష్టమైన చిత్రాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ వేద మంచి రివ్యూలతో ఆకట్టుకుంది.
అయితే రీమేక్ అంశం కారణంగా ఓపెనింగ్ డే కలెక్షన్లు నిరాశపరిచాయి. వారాంతంలో మెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు. విక్రమ్ వేద తర్వాత గ్రీక్ గాడ్ క్రిష్ 3లోనూ నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. అంతకుముందే హృతిక్ రోషన్ - అనిల్ కపూర్ .. ఇటీవల సిద్ధార్థ్ ఆనంద్ లతో ఫైటర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక కథలు భారీ యాక్షన్ సినిమాల్లో నటించిన హృతిక్ పెద్ద సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన సూచనను బాలీవుడ్ పాటిస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.