Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : అన్ లాక్ 5.0 లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్...!
By: Tupaki Desk | 30 Sep 2020 4:30 PM GMTకేంద్ర ప్రభుత్వం తాజాగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందరు అనుకున్నట్లుగానే థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని నిబంధన విధించింది.
అన్ లాక్ 5.0 నిబంధనల్లో పాఠశాలలు - ఉన్నత విద్యాసంస్థలు తెరవడంపై పూర్తి స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలివేసింది. వాటి పున ప్రారంభంపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి స్థానిక ప్రభుత్వాలనే నిర్ణయం తీసుకునేందుకు అనుమతిచ్చింది. అలానే కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ పార్కులను కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 తర్వాత క్రీడాకారుల కోసం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు కూడా అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రాకపోకలను అనుమతిస్తున్నామని.. ఎలాంటి షరతులు విధించవద్దని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే కంటోన్మెంట్ జోన్లలో ఉన్న వాటిని తెరించేందుకు అనుమతి లేదని కేంద్రం పేర్కొంది. కంటోన్మెంట్ జోన్ లలో అక్టోబరు 31వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది.