Begin typing your search above and press return to search.
'గ్రే మ్యాన్ కి' సీక్వెల్..ధనుష్ నటిస్తాడా?
By: Tupaki Desk | 29 July 2022 2:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో 'ది గ్రే మ్యాన్' తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమాలో 'ధనుష్' రోల్ గురించి వచ్చిన వ్యతిరేకత గురించి తెలిసిందే. 5 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ కి వెళ్లాలా? అని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కున్నారు. ధనుష్ కేవలం ఒక్క ఫైట్ సీన్ లో కనిపించడంతో అభిమానులు సహించలేక కపోయారు.
దీంతో అతను విలన్ పాత్ర పోషించాడా? లేక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేసాడా? అంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పాత్రలు చేయం కన్నా...ఖాళీగా ఉండటం బెటర్ అని సలహాలు సైతం ఇచ్చారు. ఆరకంగా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఎంతో పేలవంగానే జరిగింది. కోలీవుడ్ లోనే కాక..ధనుష్ కి ఇండియా వైడ్ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.
జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నాడు. అలాంటి నటుడికి చిన్న పాత్ర ఇచ్చి హాలీవుడ్ అవమానించిందని కోలీవుడ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. కానీ ఈ విమర్శలపై ఇంత వరకూ ధనుష్ స్పందించలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 'ది గ్రే మ్యాన్' కి సీక్వెల్ లో నటిస్తే ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తాడా? అన్నది తెరపైకి వస్తుంది.
ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు రూసో బ్రదర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతోనే సీక్వెల్ కి సన్నదం అవుతున్నట్లు రివీల్ చేసారు. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన ఈచిత్రం భారత్ లోనూ ఎంతో ఆదరించారని తెలిపారు. సీక్వెల్ లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ప్రాంచైజీ ఎంత కాలమైనా కొనసాగడానికి అవకాశం ఉందని అంటున్నారు.
మరి ఈ సీక్వెల్ లోగానీ..భవిష్యత్ ప్రణాళిక ప్రాంచైజీలో గానీ మళ్లీ అవకాశం వస్తే ధనుష్ నటిస్తాడా? అంటే కొత్త రకం ప్రచారం తెరపైకి వస్తోంది. దనుష్ పై వ్యతిరేకత వ్యక్తమైనా ఇంతవరకూ స్పందించలేదంటే 'ది గ్రే మ్యాన్' విషయంలో ధనుష్ పాజిటివ్ గా ఉన్నట్లే కనిపిస్తుంది.
ధనుష్ పెద్ద స్టార్ అయినా ఇమేజ్ చట్రం దాటి సినిమాలు చేస్తారు. కెరీర్ ఆరంభం నుంచి ధనష్ ప్రయాణం ఇలాగే సాగింది. ఆ కోణంలోనే 'ది గ్రే మ్యాన్' లో ఐదు నిమిషాల పాత్రైనా అంగీకరించారు. మరి అసలు సంగతి ? ఏంటి అన్నది తేలాల్సి ఉంది.