Begin typing your search above and press return to search.
నయనతార ఇంటిపై రైడ్ చేయాలని సలహా?
By: Tupaki Desk | 4 Dec 2016 9:30 AM GMTసౌత్ ఇండియన్ సినీ ఇండస్ర్టీలో అత్యంత కాంట్రవర్షియల్ హీరోయిన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు నయనతార. కళ్లు తిప్పుకోలేని అందంతో కట్టిపడేసే ఈ సెక్సీ భామ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తన రొమాంటిక్ లవ్ స్టోరీలతో కొద్దికాలం వార్తల్లో నిలిచిన ఆమె మిగతా విషయాల్లోనూ వివాదాస్పదురాలే. తాజాగా నిర్మాతలతో కయ్యానికి కాలు దువ్వుతుండడంతో వారంతా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి ఆమె ఇంటిపై రైడింగ్ చేయించాలని ట్రయ్ చేస్తున్నారట.
ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లు లేకున్నా భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న నయనతార తనకు డబ్బిచ్చిన నిర్మాతలకు ఇప్పుడు చుక్కలు చూపిస్తోందట. సినిమాకు 3 కోట్లు తీసుకుంటున్న నయనతార ఇప్పుడు ఆ డబ్బంతా వైట్ మనీ కావాలని అడుగుతోందట. ఇప్పటికే తనకు ఇచ్చిన డబ్బును వెనక్కు ఇచ్చేసి మొత్తం వైట్ మనీ కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు అగ్గిమీద గుగ్గిలమలవుతున్నారు. అంతమొత్తంలో కొత్త నోట్లు తేలేక.. నయనతారను తమ సినిమాల నుంచి తొలగించకలేక తెగ ఇబ్బంది పడుతున్నారట.
దీంతో వారు నయనపై తమకున్న కోపాన్ని తీర్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. నయన వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని ఐటీ శాఖకు కంప్లయింట్ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఇది పుకారుగానే వినిపిస్తున్నా ఐటీ శాఖ దూకుడు పెంచుతుండడంతో నయన ఇంటిపై దాడులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.