Begin typing your search above and press return to search.

యాంక‌ర‌మ్మ‌కు జీఎస్టీ తెచ్చిన ముప్పు

By:  Tupaki Desk   |   12 Dec 2019 6:50 AM GMT
యాంక‌ర‌మ్మ‌కు జీఎస్టీ తెచ్చిన ముప్పు
X
టాలీవుడ్ యాంక‌ర్లు ఎంద‌రు ఉన్నా సుమ ప్ర‌త్యేక‌త వేరు. వేదిక ఎంత పెద్ద‌ది అయినా.. ఎంత భారీ ఈవెంట్ అయినా స్పాంటేనియ‌స్ గా పంచ్ లు వేయ‌డం.. తెలివిగా త‌ప్పును క‌వ‌ర్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి. భారీ ఈవెంట్లు.. రియాలిటీ షోలు.. గేమ్ షోల‌ ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన సీనియ‌ర్ యాంకర్ త‌ను. అగ్ర హీరోల‌ సినిమా ఈవెంట్లు అంటే క‌చ్చితంగా సుమ వ్యాఖ్య‌త‌గా ఉండాల్నిందేన‌ని హీరోలు.. ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ప‌ట్టుబ‌డ‌తారు. సుమ‌కు వృత్తిలో సీనియారిటీ.. ప‌రిచ‌యాలు చ‌క్క‌ని అవ‌కాశాలిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల‌ సుమ నుంచి ర‌క‌ర‌కాల‌ డిమాండ్లు చూసి నిర్మాత‌ల‌కు..ఈవెంట్ నిర్వాహ‌కుల‌కు దిమ్మ తిరిగిపోతోంద‌ట‌. రెండు గంట‌ల‌ షోకు రూ.3-5 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిమాండ్ చేస్తోందిట. అద‌నంగా జీఎస్టీ బాదేస్తోందని.. ఇత‌ర ఖ‌ర్చులు క‌లుపుని త‌న‌ను వేదిక వ‌ద్ద‌కు ర‌ప్పించాలంటే నిర్మాత‌కి త‌డిపి మోపుడు అవుతోందని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

దీంతో నిర్మాత‌లంతా సుమ‌పై వేటు వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు అంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. సుమ క‌న్నా త‌క్కువ కే హోస్టింగ్ చేసే వారితో స‌రిపెట్టుకునేందుకు సిద్ధ‌మవుతున్నార‌ట‌. స‌రిగ్గా ఇదే అద‌నుగా మ‌రో హాట్ రైజింగ్ యాంక‌ర్ మంజుషాకు అవ‌కాశాలు ద‌క్కుతున్నాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా లో బ‌డ్జెట్ సినిమా నిర్మాత‌లు సుమ ఛార్జ్ ని త‌ట్టుకోలేక‌నే మంజుషా అయితేనే బెట‌ర్ అని భావిస్తున్నారుట‌. ఇక అగ్ర నిర్మాత‌లకి రెండు మూడు గంట‌ల‌కు మూడు లక్ష‌లు ఇవ్వ‌డం పెద్ద విష‌యంగా భావించ‌న‌ప్ప‌టికీ త‌ను ప్ర‌భుత్వానికి క‌ట్టాల్సిన జీఎస్టీని తాము ఎలా చెల్లిస్తామ‌ని సుమ‌తో వాదిస్తున్నారట‌.

త‌న‌ సంపాద‌న‌పై త‌నే స్వ‌యంగా జీఎస్టీ చెల్లించాలి కానీ.. ఇలా నిర్మాత‌ల నెత్తిన రుద్ద‌డం ఏమిటో అంటూ కాస్త సీరియ‌స్ గానే ఉన్నారుట‌. ఇది ఏ మాత్రం ప్రొత్స‌హించాల్సింది కాద‌ని.. సుమ‌ కాక‌పోతే వేరొక‌రిని ఎంపిక చేయొచ్చు అనే మిష‌తో ఉన్నార‌ట. హీరోలు- హీరోయిన్లు- ఇత‌ర శాఖ‌ల వారికి అధికంగానే పారితోషికాలు ఇస్తున్నాం. వాళ్ల జీఎస్టీలు వాళ్లే క‌ట్టుకుంటున్నారు. వాళ్ల కంటే సుమ ఎక్కువా? అని ఫిలిం స‌ర్కిల్స్ లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లతో ప్ర‌మోష‌న్ ప‌రంగా అనుసంధాన క‌ర్త‌ల్లో ముచ్చ‌ట సాగుతోంది. ఇక‌పై అయినా అలాంటి యాట్యుట్యూడ్ ని మార్చుకోక‌పోతే ఇబ్బందేన‌ని గుసగుస‌లాడుకుంటున్నారు. అన్న‌ట్టు యాంక‌ర్ల‌కు డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రం వ‌ర్తిస్తుంది క‌దా! దాని ప్ర‌కార‌మే ఇలా చేస్తున్నారా? ఇంత‌కీ మంజూష జీఎస్టీ త‌నే చెల్లిస్తున్నారా?