Begin typing your search above and press return to search.
అందాల రాక్షసిపై జీఎస్టీ అధికారుల దాడులు
By: Tupaki Desk | 20 Dec 2019 2:26 PM GMTసినీప్రముఖుల ఇండ్లు.. కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ జీఎస్టీ అధికారులు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరోలు వెంకటేష్- నాని సహా సితార ఎంటర్ టైన్ మెంట్స్ - సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించడం సంచలనమైంది. కథానాయిక రాశీ కి చెందిన కంపెనీ `కలర్స్` దేశవ్యాప్త (అన్ని మెట్రోలు) కార్యాలయాలపైనా దాడులు జరగడం వేడెక్కించిన సంగతి తెలిసిందే.
జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడుల్ని ఆపలేదింకా. సినీతారల్ని టార్గెట్ చేస్తూ ఈ తరహా దాడులు నిరంతరం సాగిస్తున్నారు. తాజాగా అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు ప్రస్తుతం లావణ్య ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఒకరకంగా ఇది ఆకస్మిక దాడి అనే చెప్పాలి. తాజా ఘటనతో ఫిలింనగర్ మరోసారి ఉలిక్కిపడింది. లావణ్య త్రిపాఠి పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటికి సంబంధించి జీఎస్టీ ఎగవేసినట్లుగా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్ లోని లావణ్య త్రిపాఠి ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఐటీ దాడుల సమాచారం అందుకున్న లావణ్య త్రిపాఠి హుఠాహుఠీన షూటింగ్ ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.