Begin typing your search above and press return to search.

అన‌సూయ‌ని వ‌ద‌ల‌ని జీఎస్టీ ఫ్రెండ్స్

By:  Tupaki Desk   |   25 Dec 2019 6:56 AM GMT
అన‌సూయ‌ని వ‌ద‌ల‌ని జీఎస్టీ ఫ్రెండ్స్
X
నిన్న‌గాక మొన్న‌నే అస‌లు త‌న‌ని జీఎస్టీ అధికారులు సోదాలు చేయ‌లేద‌ని.. అదంతా అస‌త్య ప్ర‌చారం అని యాంక‌ర్ అన‌సూయ ఖండించారు. ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. వ‌ద‌ల బొమ్మాళీ అంటూ సినీ సెల‌బ్రిటీల్ని వెంటాడుతున్న జీఎస్టీ అధికారులు అన‌సూయ‌ను వ‌దిలిపెట్ట‌లేద‌న్న‌ది లేటెస్ట్ అప్ డేట్.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.55లక్షల జీఎస్టీ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నార‌ని తెలుస్తోంది. సేవా ప‌న్ను రూపంలోనే రూ.80లక్షలు అనసూయ బకాయి ఉన్నార‌ట‌. రూ.25లక్షలు మాత్రమే సేవా ప‌న్ను చెల్లిస్తే.. బ్యాలెన్స్ రూ.55లక్షలు చెల్లించి తీరాల్సిందేనంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు.

త్రివిక్ర‌మ్ - వ‌క్కంతం వంశీ వంటి ప్రముఖుల‌పైనా జీఎస్టీ సోదాలు అంటూ తాజాగా వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో అన‌సూయ‌పైనా జీఎస్టీ దాడులు నిర్వ‌హించ‌డం వేడెక్కిస్తోంది. ఇండ‌స్ట్రీలో ఆదాయ వ‌ర్గాల్ని అధికారులు వెంటాడు వేటాడు త‌ర‌హాలో వెంబ‌డించ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. వెంక‌టేష్- డి.సురేష్ బాబు- నాని స‌హా ప‌లువురిపైనా ఇంత‌కుముందు జీఎస్టీ అధికారులు దాడులు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. స‌వ్యంగా పన్నులు చెల్లించ‌డాన్ని సెల‌బ్రిటీల‌కు అల‌వ‌ర్చే క్ర‌మంలోనే పాపం జీఎస్టీ అధికారులు రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా ప‌ని చేస్తుండ‌డంపైనా అంతే ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది.