Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ వ్వావ్ అనేలా ప్రీరిలీజ్ అతిధులు
By: Tupaki Desk | 12 Sep 2019 12:06 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. యువ మంత్రి కేటీఆర్ .. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా? అంటే అవుననే సమాచారం. `సైరా` ప్రీరిలీజ్ ఈవెంట్..ఇందుకు వేదిక కాబోతోందట. ఇప్పటికే ఆ ముగ్గురికి కొణిదెల కాంపౌండ్ ఆహ్వానం పంపనుందని తెలుస్తోంది.
`సైరా: నరసింహారెడ్డి` ప్రీరిలీజ్ వేడుక రకరకాల కారణాలతో కర్నూలు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది అన్న వార్తల నడుమ ఈ వేడుక ఎక్కడ జరుగుతుంది? ఎవరెవరు అతిధులుగా విచ్చేస్తారు? అన్న ఆసక్తికర చర్చ మెగాభిమానుల్లో సాగుతోంది. ఈనెల 18న ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుందన్నది తాజా సమాచారం. గచ్చిబౌళి ఇండోర్ స్టేడియం లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది.
ఇటీవలే సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ సమక్షంలో నెవ్వర్ బిఫోర్ అనదగ్గ స్థాయిలో నిర్వహించారు. అంతకుమించి మెగాభిమానుల సమక్షంలో భారీగా ఈవెంట్ చేయాలని సైరా నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారట. ఈ వేడుకకు ఎస్.ఎస్.రాజమౌళి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మంత్రి కేటీఆర్ విచ్చేస్తారని చెబుతున్నారు. ఆ ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరు అభిమానించుకుంటారు.. గౌరవించుకుంటారు. అయితే ఇలా ఒక ఆడియో వేడుకలో కలుసుకుని ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అన్నది మాత్రం తొలిసారి. ఇంట్రెస్టింగ్ కదూ!