Begin typing your search above and press return to search.
గిల్డ్ కి శుభం కార్డ్ వేసేస్తున్నారా?
By: Tupaki Desk | 4 Sep 2022 3:30 AM GMTకరోనా తరువాత సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందని, ప్రేక్షకుల దృక్పథంలోనూ, సినిమాని చూసే తీరులోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, అంతే కాకుండా ఆర్టిస్ట్ ల పారితోషికాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు ముందుగా షూటింగ్ ల బంధ్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని నిర్మాతల మండలి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా వ్యతిరేకించినా చివరికి వారితో ఏకీభవిస్తూ ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పూర్త మద్ధతుని ప్రకటించింది.
అప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృస్టి పెట్టి ఒక్కో సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ వెళుతున్నారు. ఆర్టిస్ట్ ల సమస్యలపై `మా` అధ్యక్షుడితో ప్రత్యేకంగా భేటీ కావడం, ఆర్టిస్ట్ ల పారితోషికాలపై చర్చించడం వండటికి చేసి ఆర్టిస్ట్ ల పారితోషికాలే కాకుండా వారి ఎక్స్ ట్రా ఖర్చులపై కత్తెర పెట్టడంలో సఫలం అయ్యారు. ఇక నిర్మాతలకు ప్రధాన సమస్యగా మారిన హీరోయిన్ ల మేనేజర్లతో ప్రత్యేకంగా భేటీలను నిర్వహించారు.
సరికొత్త రూల్స్ ని పాటించాలంటూ కొత్త నిబంధనలని వెల్లడించారు. హీరోయిన్ లు తమ వెంట వచ్చే వారి సిబ్బందికి ఫుడ్ ఖర్చు తో పాటు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులు వారే భరించాలని, ఫుడ్ ప్రత్యేకంగా కావాలంటే వారి డబ్బుల నుంచే తెప్పించుకోవాలని కఠన నిబంధనల్ని వెల్లడించి షాకిచ్చారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో కొంత మంది మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని గుర్తించి వారికి తగిన కోతలు విధించారు.
ఇదిలా వుంటే మరి కొన్ని సమస్యలు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి యధావిదిగా షూటింగ్ లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై ఆసక్తికర వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాన సమస్యలు ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి శుభం కార్డ్ వేసేసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కలిపేస్తున్నారని. ఈ విలీన ప్రక్రియ ఈ నెల 6న జరగనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అదే రోజు మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అంటూ 70 మంది ప్రొడ్యూసర్లు నిర్మాతల మండలితో విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీనిపై చాలా రోజులుగా కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వుండగా గిల్డ్ ఎందుకు అంటూ భారీ చిత్రాల నిర్మాతలు బాహాటంగానే గిల్డ్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిల్డ్ కి మంగళం పాడేసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కలిపేస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.