Begin typing your search above and press return to search.
కీలక సమస్యలపై గిల్డ్ కొత్త కమిటీలివే!
By: Tupaki Desk | 27 July 2022 10:19 AM GMTగత కొంత కాలంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మాణ పరమైన సమస్యలతో పాటు బడ్జెట్ పై పట్టుకోల్పోతున్నారు. అంతే కాకుండా తాజాగా ఓటీటీలు, టికెట్ రేట్ల పెరుగుదల కారణంగా తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు బడ్జెట్ లు పెరిగిపోవడం, స్టార్ల రెమ్యునరేషన్ లు చుక్కలని తాకడంతో ప్రొడ్యూసర్స్ సినిమాపై తమ పట్టుని కోల్పోతున్నారు. దీంతో సినిమాపై పెడుతున్న పెట్టుబడికి వస్తున్న రాబడికి ఎక్కడా పొంతన లేకుండా పోతోంది.
ఇదే అంశాలని ప్రధానంగా చర్చిస్తూ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి సినిమాల షూటింగ్ లని సమస్యలు కొలిక్కి వచ్చేంత వరకు నిలిపివేయాని నిర్ణయింది. పాండమిక్ తరువాత బడ్జెట్ లు భారీగా పెరిగిపోవడం, ఆర్టిస్ట్ ల పారితోషికాలపై నియంత్రణ లేకపోవడంతో తాజాగా షూటింగ్ ల బంద్ కి పిలుపు నిచ్చింది.
తాజా సమస్యలపై అత్యవసరంగా సమావేశమైన గిల్డ్ తాజాగా మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కీలక సభ్యులతో మూడు ప్రధాన కమిటీలని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ద్వారా ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని చెబుతోంది.
ఇంతకీ ఆ మూడు ప్రధాన సమస్యలు ఏంటంటే 1) థియేటర్ అండ్ ఎగ్జిబిటర్ల కమిటీ, 2 ) ఓటీటీ రిలీజ్ లని నియంత్రించే కమిటీ, 3) కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సమస్యలు నివారించే కమిటీ.
ఈ మూడు కమిటీల్లో ప్రధాన మైనది థియేటర్ అండ్ ఎగ్జిబిటర్ల కమిటీ. ఈ కమిటీలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, ఎన్. సుధాకర్ రెడ్డి, యువీ క్రియేషన్స్ వంశీ వుంటారు. ఇక ఓటీటీ రిలీజ్ లని నియంత్రించే కమిటీ లో బాపినీడు, ఏ.ఎం. రత్నం, పి. కిరణ్ ప్రధానంగా వుంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సమస్యలు నివారించే కమిటీలో సూర్యదేవర నాగవంశీ, వివేక్ కూచీభోట్ల, రవికిషోర్ ప్రధాన భూమిక పోషించనున్నారు.
మూడు కమిటీల వివరాలివి.
1) థియేటర్ అండ్ ఎగ్జిబిటర్ల కమిటీ
దిల్ రాజు (కన్వీనర్)
ఎన్. సుధాకర్ రెడ్డి
యువీ క్రియేషన్స్ వంశీ
వీర్నాయుడు
బన్నీవాసు
సాయిబాబు అన్నపూర్ణ
రామ్ మోహన్
ఎన్ వి. ప్రసాద్
2 ) ఓటీటీ రిలీజ్ లని నియంత్రించే కమిటీ
బాపినీడు (కన్వీనర్)
ఏ.ఎం. రత్నం
పి. కిరణ్
యువీ వంశీ
రవి మైత్రీ మూవీ మేకర్స్
శరత్
3) కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సమస్యలు నివారించే కమిటీ
నాగవంశీ
వివేక్ కూచీబోట్లా (కన్వీనర్)
రవికిషోర్
శివలెంక కృష్ణప్రసాద్
మధు
కిషోర్
రాధామోహన్
గోపీ 14 రీల్స్
బెక్కెం వేణుగోపాల్
చిట్టూరి శ్రీనివాస్
సుధాకర్ చెరుకూరి
దామోద్‌ర్ ప్రసాద్
సాహుగారపాటి
అనురాగ్ పర్వతనేని