Begin typing your search above and press return to search.
గల్లి బాయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు
By: Tupaki Desk | 17 Feb 2019 5:30 PM GMTప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలో సోలోగా పోటీ లేకుండా దిగిన గల్లీ బాయ్ యాభై కోట్ల మార్క్ దాటేసి ఈ వీక్ ఎండ్ ని గ్రాండ్ గా ముగించబోతున్నాడు. నిన్నటితోనే ఈ ఫీట్ చేరుకున్న గల్లి బాయ్ రేపు ఉదయానికి వచ్చే రిపోర్ట్స్ లో 65 నుంచి 70 కోట్ల మధ్యలో నిలవోచ్చని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్ష్ పేర్కొనడం విశేషం. మెట్రో లైఫ్ లో స్లం జీవితానికి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ర్యాప్ మ్యూజిక్ ని దర్శకురాలు జాయా అక్తర్ ముడిపెట్టిన తీరుకి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో మంచి స్పందన లభిస్తోంది.
తెలుగులో వచ్చేటప్పటికి మొన్న వచ్చిన దేవ్-లవర్స్ డే తీవ్రంగా నిరాశపరిచిన నేపధ్యంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో దీని బుకింగ్స్ బాగున్నాయి. మల్టీ ప్లెక్సుల్లో దీని హవానే నడుస్తోంది. అయితే బిసి సెంటర్స్ తో పాటు జిల్లా కేంద్రాల్లో కొంత వీక్ గా ఉన్న మాట వాస్తవం. నిడివితో పాటు కథనం కొంత స్లోగా ఉండటం వసూళ్ళ మీద ప్రభావం చూపిస్తోంది.
మొదటి రోజు 19 కోట్ల 40 లక్షల దాకా రాబట్టిన గల్లీ బాయ్ రెండో రోజు స్లో అయ్యాడు. కేవలం 13 కోట్ల 10 లక్షలతో కొన్ని అనుమానాలు రేకెత్తించాడు. అయితే అనూహ్యంగా నిన్న శనివారం వీకెండ్ ని పూర్తిగా వాడుకుంటూ 18 కోట్ల 65 లక్షలు రాబట్టి స్పీడ్ పెంచి చూపించాడు. మొత్తం 51 కోట్ల 15 లక్షలతో పర్ఫెక్ట్ గా ముగించాడు.
ఈ రోజు సండే కాబట్టి ఈజీగా 18 నుంచి 20 కోట్ల దాకా వచ్చినా ఆశ్చర్యం లేదు. లోపాలు ఉన్నప్పటికీ రన్వీర్ సింగ్-అలియా భట్ ల కట్టిపడేసే పెర్ఫార్మన్స్ దీన్ని మస్ట్ వాచ్ క్యాటగిరీలో వేస్తోంది. గత ఏడాది సింబాతో ఘనంగా ముగించిన రన్వీర్ సింగ్ ఈ సంవత్సరం మొదటి బోణీ కూడా తనే కొట్టాడు. చూస్తుంటే ఇతగాడి దశ మహా జోరుగా ఉన్నట్టుంది