Begin typing your search above and press return to search.
రాజమౌళిని ఫాలో అవుతున్న గుణశేఖర్
By: Tupaki Desk | 26 May 2015 12:29 PM GMTపైసా ఖర్చు పెట్టకుండా కోట్ల రూపాయల ఫ్రీ పబ్లిసిటీ పొందుతోంది బాహుబలి టీమ్. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను వేదికగా చేసుకుని రాజమౌళో లేక బాహుబలి టీమ్‌లో ఇంకెవరో ఏదైనా విశేషం వెల్లడిస్తే చాలు.. మొత్తం మీడియా దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తోంది. బాలీవుడ్ స్టయిల్లోనే కొన్ని వివాదాలు కూడా బాహుబలి టీమ్‌కు కలిసొస్తున్నాయి. కాపీ గొడవల వల్ల రాజమౌళికి కొంచెం చెడ్డపేరు వచ్చినప్పటికీ అంతకుమించి ఫ్రీ పబ్లిసిటీ వచ్చిపడింది. మేకింగ్ వీడియోను కాపీ కొట్టడం గురించే కాదు.. తాజాగా బాహుబలి పసిపాప పోస్టర్ కాపీ గురించి కూడా చాలా పబ్లిసిటీనే వచ్చింది.
ఐతే బాహుబలి టైపులోనే చారిత్రక కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రుద్రమదేవి' మాత్రం ఈ స్థాయిలో వార్తల్లో నిలవలేకపోతోంది. ఆ మధ్య ఆడియో ఫంక్షన్‌తో హడావుడి చేశాక.. మళ్లీ సినిమా గురించి చర్చే లేదు. ఇలాంటి సమయంలో తన సినిమాను వార్తల్లో నిలపడానికి కొన్ని రోజులుగా ఆన్ ద సెట్స్ ఫొటోల్ని.. కొత్త కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాడు. అందులో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పోస్టర్ మీద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో చర్చ నడుస్తోంది.
గత ఏడాది రిలీజైన హాలీవుడ్ మూవీ 'డ్రాకులా' పోస్టర్‌నే దించేసి ఈ పోస్టర్ తయారు చేయించాడు గుణశేఖర్. బాహుబలి పోస్టర్ విషయంలో బ్యాగ్రౌండ్‌తో పాటు ఇంకొన్ని మార్పులైనా చేశారు కానీ.. బన్నీ పోస్టర్ మాత్రం డిట్టో దించేశారు. దీని మీద ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో జోకులు పేలుతున్నాయి. ఐతే ఇలాగైనా సినిమాకు పబ్లిసిటీ వస్తోంది కదా అని గుణశేఖర్ హ్యాపీగా ఫీలవుతున్నట్లుంది. బహుశా ఆ పోస్టర్‌ను కాపీ కొట్టడంలో ఉద్దేశం కూడా అదేనేమో.