Begin typing your search above and press return to search.
సమంత సహకారం మరిచిపోలేనిదన్న గుణశేఖర్
By: Tupaki Desk | 3 Jun 2021 12:30 PM GMTతెలుగులో పౌరాణిక చిత్రాలను తెరకెక్కించగల అనుభవం కలిగిన దర్శకుడిగా గుణశేఖర్ కనిపిస్తారు. బాలలతో 'రామాయణం' తరువాత ఆయన చేస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. ఒక వైపున కణ్వ మహర్షి ఆశ్రమం .. మరో వైపున హస్తినాపురం రాజ్యం .. ఈ మధ్యలో శకుంతల - దుష్యంతుల ప్రేమకథ .. ఈ కథావస్తువుతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ను సమంత పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రోగ్రెస్ ను గురించి గుణశేఖర్ ప్రస్తావించారు.
'శాకుంతలం' చాలా పెద్ద ప్రాజెక్టు .. ఈ సినిమా తీయడానికి సంవత్సరాలు పడుతుందని అనుకున్నారు. మూడు నాలుగు నెలల్లోనే మేము 50 శాతం చిత్రీకరణను పూర్తిచేశామని చెప్పినప్పుడు అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మేము చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఏడాది పాటు మేము ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని ఉండటం వలన, షూటింగు పరంగా మేము హడావిడి పడింది లేదు. మరో మూడు నెలల్లో మిగతా 50శాతం చిత్రీకరణను పూర్తి చేస్తాము.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో రెండు భారీ సెట్లు వేయడం జరిగింది. షూటింగు కొన్ని రోజుల పాటు జరిగిన తరువాత కరోనా ఉద్ధృతి పెరిగిపోయింది. ఆ సమయంలో టీమ్ లోని వారందరికీ నీలిమ ఎప్పటికప్పుడు టెస్టులు చేయిస్తూ కేర్ తీసుకుంది. కరోనా విషయంలో మేము తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి, షూటింగును కంటిన్యూ చేయడానికి సమంత అంగీకరించారు. షూటింగు ఆపేస్తే నిర్మాతలకు నష్టం వస్తుందని భావించి చాలా సపోర్టు చేశారు. ఆమె వల్లనే సెట్ వర్క్ మొత్తం పూర్తిచేసి, స్టూడియోలోని రెండు ఫ్లోర్లు కూడా ఖాళీ చేసేశాం" అని చెప్పుకొచ్చారు.