Begin typing your search above and press return to search.
సమంతను చూస్తే శకుంతలే కనిపించింది: గుణశేఖర్
By: Tupaki Desk | 3 Jun 2021 7:30 AM GMTగుణశేఖర్ తన తాజా చిత్రంగా 'శాకుంతలం' రూపొందిస్తున్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కథానాయకుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పర్యవేక్షణను గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ చూసుకుంటున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 'శాకుంతలం' చేయాలని అనుకున్నప్పుడు కథానాయికగా ఎవరైతే బాగుంటారా? అనే ఆలోచనలో పడ్డాను. కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది కనుక, సరైన నాయిక దొరకడమే ప్రధానం.
ఆ సమయంలో మా అమ్మాయి నీలిమనే సమంత పేరును ప్రస్తావించింది. ఆమె అయితే ఈ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాళిదాసు వర్ణనను బట్టి చూసుకుంటే ఈ పాత్రకి శ్రీదేవిగారే కళ్లముందు కదలాడతారు. ఆ స్థాయిలో ఇప్పుడున్న కథానాయికలు ఎవరా అనే ఆలోచనలో ఉన్న నేను, సమంత పేరు వినగానే ఆలోచనలో పడ్డాను. ఆమె మోడ్రన్ పాత్రలకే బాగుంటారు కదా? అనిపించింది. అప్పుడు మా అమ్మాయి 'రంగస్థలం' సినిమాలోని రామలక్ష్మి పాత్రను గుర్తుచేసింది.
'రామలక్ష్మి' పాత్రలో సమంత నటన చూశాను .. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. తెరపై రామలక్ష్మి తప్ప సమంతగారు కనిపించలేదు. అంతటి అంకితభావంతో ఆమె నటించారు. సరైన పాత్ర దొరికితే చాలు .. తనని తాను మలచుకునే సత్తా ఆమెకి ఉందనిపించింది. సమంతగారు ఈ కథకి కనెక్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఆమెలో శకుంతలే కనిపించింది. ఆ పాత్రను అర్థం చేసుకుని అందులో ఒదిగిపోవడానికి ఆమె రెండు నెలల సమయం తీసుకున్నారు. ఈ సినిమా చూసినవాళ్లు సమంత అంటే శకుంతల .. శకుంతల అంటే సమంత అనుకోవడం ఖాయం" అని చెప్పుకొచ్చారు.