Begin typing your search above and press return to search.

హేయ్‌.. రుద్ర‌మ‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చిన‌ట్టే..

By:  Tupaki Desk   |   29 Sep 2015 9:30 AM GMT
హేయ్‌.. రుద్ర‌మ‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చిన‌ట్టే..
X
రుద్ర‌మ‌దేవి 3డి రిలీజ్ వ్య‌వ‌హారం ఆన్‌ లైన్ లాట‌రీలానే ఉంది. ఇంత‌కాలం లాట‌రీ ఎప్పుడు త‌గులుతుందా? అన్న‌ట్టే ఎదురు చూడాల్సొచ్చింది. రిలీజ్ ఎప్పుడో క‌చ్ఛితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. ఎట్ట‌కేల‌కు ద‌ర్శ‌క‌నిర్మాత గుణ‌శేఖ‌ర్ పూర్తి క్లారిటీతో ఉన్నారిప్పుడు. రుద్ర‌మ‌దేవి 3డి ప్ర‌క‌టించిన‌ట్టే అక్టోబ‌ర్ 9న రిలీజైపోతోంది. అయితే హిందీ వెర్ష‌న్ మాత్రం రిలీజ‌య్యే ఛాన్స్‌లేదు. డీటెయిల్స్‌ లోకి వెళితే..

గుణ‌శేఖ‌ర్ ఎంతో ప‌ట్టుద‌ల‌తో 70కోట్లు పైగా బ‌డ్జెట్ ఖ‌ర్చు చేసి కాక‌తీయుల చ‌రిత్ర‌ను - రుద్ర‌మ‌దేవి వీర‌త్వాన్ని 3డిలో విజువ‌లైజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ టైమ్‌ కి ఆర్థికంగా కొన్ని చిక్కుల్లో ప‌డ్డారాయ‌న. బిజినెస్ ప‌రంగానూ కొన్ని ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో ఇప్ప‌టికే నాలుగైదు సార్లు సినిమా రిలీజ్ తేదీ ప్ర‌క‌టించి వాయిదా వేయాల్సొచ్చింది. దీనివ‌ల్ల గుణ‌శేఖ‌ర్‌ కి ఫైనాన్సియ‌ల్‌ గానూ ఇబ్బందులు త‌లెత్తాయి. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లో సినిమాని చెప్పిన టైముకే అంటే అక్టోబ‌ర్ 9 రోజున రిలీజ్ చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. త‌న వాద‌న వినిపించారు.

మొన్న‌టిరోజున ఏపీ ఫిలింఛాంబ‌ర్‌ లో ఈ సినిమా విష‌య‌మై పంపిణీదారులంద‌రినీ పిలిచి ఓ స‌మావేశం ఏర్పాటు చేసి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు బ‌డా నిర్మాత‌లు రుద్ర‌మ‌దేవిని వాయిదా వేసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చినా గుణ‌శేఖ‌ర్ త‌న మాట‌కే క‌ట్టుబ‌డ్డారు. ఈ మీటింగ్‌ లో ఫైనాన్సియ‌ర్స్ కం డిస్ర్టిబ్యూట‌ర్స్ రుద్ర‌మ‌దేవి 3డిని రిలీజ్ చేసేందుకు క్లియ‌రెన్స్ ఇచ్చారు. ఇక తెలుగు - త‌మిళ్‌ - మ‌ల‌యాళ వెర్ష‌న్ల రిలీజ్ ఖాయ‌మైన‌ట్టే. అయితే హిందీ వెర్ష‌న్ విష‌యంలో అభిషేక్ పిక్చ‌ర్స్‌- రిలయ‌న్స్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ సంస్థ‌లు చివ‌రి నిమిషంలో హ్యాండిచ్చాయి. ఒక‌సారి ప్రాజెక్టు బైటికొచ్చాక కాన్ఫిడెంటుగా హిట్ కొట్టి ఆ త‌ర్వాత హిందీలో రిలీజ్ చేయాల‌ని గుణ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అదీ సంగ‌తి.