Begin typing your search above and press return to search.
25 రోజులే.. ఇక నో మోర్ డిలే
By: Tupaki Desk | 14 Sep 2015 5:30 PM GMTఇదిగో వచ్చేస్తోంది. అదిగో వచ్చేస్తోంది.. అంటూనే ఈ ఆర్నెళ్లలో ఐదారు ప్రకటనలు వచ్చాయి. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురైంది. రుద్రమదేవి రానే లేదు. కాకతీయులు వైభవాన్ని వెండితెరపై 3డిలో చూసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరలేదు. గుణశేఖరుడు రిలీజ్ విషయంలో ఎక్కడా రాజీకి రావడం లేదు. గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ సహా ప్రతి విషయంలోనూ పెర్ఫెక్షన్ కోసం తీవ్రంగా శ్రమించాడు. ట్రైలర్ పై వచ్చిన మిశ్రమ స్పందన చూశాక దానిని మరింతగా మార్పు చేర్పులతో తీర్చిదిద్దాలని కసరత్తు చేశాడో ఏమో చివరి నిమిషయంలో రిలీజ్ అని చెబుతూనే వెయిట్ చేయించాడు.
కారణం ఏదైనా భారతదేశంలోనే తొలి హిస్టారికల్ 3డి సినిమా ఆలస్యమైంది. ఆలస్యంగానైనా వచ్చేస్తోంది. ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఇక సందేహమే లేదు. ఇంకో 25 రోజులు మాత్రమే. గుణశేఖర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసేశాడు. అధికారికంగా ఆన్ లైన్ లో ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. బన్ని - అనుష్క - రానా ముగ్గురూ కనిపిస్తున్న ఈ పోస్టర్ పై ఇక 25 రోజులే అంటూ ముద్రించాడు. ఇక ఆలస్యం చేయం అని చెప్పకనే చెప్పాడు. వార్ ఎపిక్ డ్రామా చూడాలంటే ఈ కొంత గ్యాప్ ఓపిక పట్టాల్సిందే మరి. రుద్రమగా అనుష్క ప్రతాపం, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ విరోచిత పోరాటాలు, చాళుక్య వీరభద్రుడిగా రానా అసమాన ప్రతిభా పాఠవం, 3 డి విజువల్స్ ని గుదిగుచ్చడంలో గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభ ఇన్నిటిని చూడాలంటే ఆమాత్రం ఆగలేరూ?