Begin typing your search above and press return to search.
గుణశేఖర్ కుమార్తె పెళ్లిలో మెగా సందడి
By: Tupaki Desk | 3 Dec 2022 3:44 AM GMTప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పెద్ద కూతురు.. ప్రతిష్ఠాత్మక శాకుంతలం నిర్మాత నీలిమ గుణ ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ శనివారం మధ్యాహ్నం 12:31 గంటలకు వివాహం చేసుకోనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త - పారిశ్రామికవేత్త శ్రీ శక్తి గ్రూప్ చైర్మన్.. డాక్టర్ రామ కృష్ణ పింజల- శ్రీమతి. సత్య పింజల కుమారుడు రవి ప్రక్య పెళ్లికొడుకు.
ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. వెన్యూ ఎక్కడ? అంటే.. హైదరాబాద్ లో పురాతన చరిత్రతో ఎంతో పాపులరైన ఫలుక్ నుమా ప్యాలెస్ వేదికగా ఈ వివాహం జరగనుంది. పెళ్లికి సినీరాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సహా సందడి చేసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. నూతన వధూవరులకు మెగాస్టార్ శుభాకాంక్షలు చెబుతూ తన ఆశీస్సులను అందించారు. చిరుతో పాటు ఆయన సతీమణి శ్రీమతి సురేఖ ఈ వేడుకకు విచ్చేశారు.
గుణశేఖర్ కూతురు నీలిమ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం ఫలక్ నుమా ప్యాలెస్ ని గుణశేఖర్ అభిరుచికి తగ్గట్టు అందమైన భారీ సెట్ లా డిజైన్ చేసారని తెలిసింది. ఇక వరుడి విద్య వృత్తి సహా ఇతర వివరాలు మరింతగా తెలియాల్సి ఉంది.
హిందూ సంస్కృతిలో వివాహాలు అన్నివేళలా ప్రత్యేకమైనవి. హిందూ వివాహం సారాంశం ఆచారాలతో పాటు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో ఆధ్యాత్మికంగా మానసికంగా ఇద్దరు వ్యక్తుల కలయికగా శాస్త్రం చెబుతోంది. టాలీవుడ్ బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోను సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో ప్రీవెడ్డింగ్ వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.