Begin typing your search above and press return to search.

గుణశేఖర్‌కు ఏమైంది?

By:  Tupaki Desk   |   12 July 2015 5:28 PM GMT
గుణశేఖర్‌కు ఏమైంది?
X
పాపం గుణశేఖర్.. బయటికి చెప్పుకోకున్నా అతడు ఎంత కష్టంలో ఉన్నాడో.. ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాడో అందరికీ తెలుసు. తన జీవితాన్ని పణంగా పెట్టి తీసిన సినిమా ‘రుద్రమదేవి’ విడుదలకు నోచుకోకపోవడం అతణ్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. సాంకేతిక కారణాలతోనే సినిమా వాయిదా పడుతున్నట్లు చెబుతున్నప్పటికీ.. గుణశేఖర్ అనుకున్న స్థాయికి దరిదాపుల్లో కూడా బిజినెస్ కాకపోవడం వల్లే సినిమా విడుదల కావట్లేదన్నది వాస్తవం. తన ట్రాక్ రికార్డు బాలేకున్నా.. సినిమాకు స్టార్ అట్రాక్షన్ తక్కువైనా.. హద్దుపద్దూ లేకుండా ఏకంగా 70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశాడు గుణ. బాహుబలి సినిమాతో పోలిస్తే ఇది తక్కువే కావచ్చు.. కానీ తన ట్రాక్ రికార్డు, రుద్రమ దేవిలో ఉన్న స్టార్ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఇది చాలా ఎక్కువ.

తాను పెట్టిన బడ్జెట్ మీద లాభాలేమీ ఆశించట్లేదు కానీ.. కనీసం దానికి దగ్గర్లో అయినా సినిమాను అమ్మాలని చూస్తున్నాడు గుణ. ఐతే అన్ని లెక్కలూ కలుపుకున్నా 50 కోట్లు సమకూరడం కూడా కష్టంగా ఉంది. స్టార్ వాల్యూ తగ్గడం వల్ల కావచ్చు.. ఇప్పటికే రెండుమూడు సార్లు వాయిదా పడటం వల్ల కావచ్చు.. బయ్యర్లు సినిమాను తక్కువకు అమ్ముతున్నారు. గత నెల 26న సినిమా విడుదల కాకపోవడానికి కూడా అసలు కారణం అదే. దీంతో సినిమా మీద బెంగ పెట్టుకుని గుణశేఖర్ కొంత మానసిక ఆందోళనకు గురై.. అనారోగ్యం పాలయ్యారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పని ఒత్తిడి వల్ల అని కూడా కొందరంటున్నా.. విడుదల తాలూకు టెన్షన్ వల్లే అన్నది ఎక్కువమంది చెబుతున్న మాట. ఐతే ఆయన ఆరోగ్యం గురించి సరైన సమాచారం మాత్రం బయటికి రావట్లేదు.