Begin typing your search above and press return to search.

70కోట్లు.. వడ్డీలు కలుపుకుని 80కోట్లు

By:  Tupaki Desk   |   6 Oct 2015 11:42 AM GMT
70కోట్లు.. వడ్డీలు కలుపుకుని 80కోట్లు
X
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని చివరికి రుద్రమదేవి 3డి చిత్రాన్ని ఈనెల 9న రిలీజ్‌ చేస్తున్నాడు గుణశేఖర్‌. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ ఎంత? అన్నదానికి ఇప్పటివరకూ జనాల్లో క్లారిటీ లేదు. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని గుణశేఖర్‌ ఇదివరకు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ 70కోట్లకు వడ్డీలు కలుపుకుని రూ.80 కోట్లు ఖర్చయ్యిందని గుణశేఖర్‌ చెబుతున్నాడు.

''ఈ సినిమాకి 3డి విషయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. సరిపడినంత సాంకేతిక నిపుణులు లేరు. అనుకున్నది అనుకున్నట్టే రాలేదు. దాంతో చాలా ఆలస్యం చేయాల్సొచ్చింది. అయితే మీరంతా అనుకున్నట్టే ఆర్థిక కష్టాలేవీ లేవు. శ్రమ పరంగా ఎక్కువ కష్టించాల్సొచ్చింది అంతే. అసలే 3డి స్టీరియో స్కోపిక్‌ సినిమా అవ్వడం వల్ల ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడాల్సి వచ్చింది...'' అని చెప్పారు.

''రిలీజ్‌ తేదీ పలుమార్లు వాయిదా పడింది.. అది ఆర్థిక కారణాల వల్ల అని అంతా ప్రచారం చేశారు. కానీ అదేం లేదు. టెక్నాలజీ పరమైన చిక్కుల్ని అధిగమించలేకే ఆ ఆలస్యం. మొత్తానికి అనుకున్నది సాధించాం.. అని గుణశేఖర్‌ చెప్పారు. వాస్తవంగా ఈ సినిమాని గోన గన్నారెడ్డి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీస్తే అది కమర్షియల్‌ గా వర్కవుటవుతుందని కొందరు నిర్మాతలు సలహాలిచ్చారు. కానీ నాకు రుద్రమదేవి కథ మాత్రమే కనిపించింది. ఇంకా చెప్పాలంటే రుద్రమదేవి వీరత్వం - సెన్సిబిలిటీస్‌ కనిపించాయి'' అంటున్నాడు గుణశేఖర్‌.

ఈ చిత్రం ఒక్కడును మించిన కమర్షియల్‌ సినిమా. అది నమ్మి నేనే నిర్మాతగా సినిమాని ప్రారంభించాను. పెద్ద పెద్ద స్టూడియోల ఓనర్లు తీయాల్సిన చిత్రాన్ని నేను తీసే సాహసం చేశాను. నన్ను నేను అంత బలంగా నమ్మి చేశాను. టెక్నాలజీ పరంగానూ ఎంతో అప్‌ డేట్‌ అయ్యానని గుణశేఖర్‌ చెప్పారు.