Begin typing your search above and press return to search.
రుద్రమని బాగా గ్లామరైజ్ చేశారట
By: Tupaki Desk | 8 Oct 2015 3:30 PM GMTరుద్రమదేవి గురించిన ఒక్కో నిజం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవే. చరిత్ర ఆధారంగా 800 ఏళ్లనాటి క్యారెక్టర్లు ఇలా ఉండేవి అని మనం ఎవరైనా చెప్పగలమా? చాలా కష్టం. రుద్రమదేవి గురించి కానీ, గోనగన్నారెడ్డి గురించి కానీ అసలు ఏ ఆధారాలు లేనేలేవు. అవన్నీ ఊహల్లో జనించిన క్యారెక్టర్లే. రేపు థియేటర్లలో చూడబోయే ఈ సినిమాకి సంబంధించిన ఓ కఠోర నిజం మాత్రం ఇప్పటికీ అలానే దాచి ఉంచేశారు.
అసలు ఆ కాలంలో గోనగన్నారెడ్డి అనే బంధిపోటు ఏజ్డ్ పర్సన్. బాగా ఎక్కువ వయసున్న క్యారెక్టర్ అది. కానీ అల్లు అర్జున్ ని తీసుకొచ్చేటప్పటికి అది పూర్తిగా యంగ్ గా మారిపోయింది. అదొక్కటే కాదు ఈ సినిమాని పూర్తిగా కమర్షియలైజ్ చేయడానికి ఉన్న క్యారెక్టర్లన్నిటినీ యంగ్ క్యారెక్టర్ లుగా మార్చేశారు. రానా - నిత్యామీనన్ - క్యాథరీన్ వీళ్లందరివి వాస్తవంలో వయసు ఎక్కువ కనిపించే పాత్రలు. కానీ వారిని యంగ్ ఏజ్ లో చూపించే ఎటెంప్ట్ చేశారు. గ్లామరైజ్ చేయడం ద్వారా యూత్‌కి ఎక్కించాలన్న ప్రయత్నం చేశాడు గుణశేఖర్. సినిమా అంటే కమర్షియల్ కాబట్టి అందుకు తగ్గట్టే యూత్ ని థియేటర్లకు రప్పించాలంటే ఈ స్టఫ్ అవసరం అని భావించి అలా చేశాడు.
ఏదేమైనా మన తెలుగు వీరనారి రుద్రమ జీవితాన్ని, కాకతీయుల వైభవాన్ని ఇలా తెరపై చూపించాలన్న ఆయన ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేం. ఇంకో 12 గంటలే.. కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫర్ రుద్రమదేవి.