Begin typing your search above and press return to search.
వేరే ఛాయిస్ లేదు రుద్రమదేవీ..
By: Tupaki Desk | 26 Aug 2015 2:07 PM GMTకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?.. ఇది క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది. ఐతే ఈ ప్రశ్న నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. రుద్రమదేవి ఎప్పుడు రిలీజవుతుంది? ఇంతకీ ఆ సినిమా వాయిదా పడుతుండటానికి కారణాలేంటి? అనే ప్రశ్నలు తర్వాతి స్థానాల్లో ఉంటాయేమో! ఆ స్థాయిలో అసహనానికి గురి చేస్తున్నాడు గుణశేఖర్. మార్చి 25 పోయింది.. జూన్ 26 పోయింది.. ఇప్పుడు సెప్టెంబరు 4ను కూడా వదిలేశాడు గుణశేఖరుడు. తన సినిమాను వాయిదా వేసిన సంగతి కూడా అఫీషియల్ గా ప్రకటించకుండా సైలెంటుగా సైడైపోయాడు. కొత్త డేటు గురించి కూడా మాట్లాడట్లేదు. ఐతే గుణ సన్నిహితుల సమాచారం ప్రకారం సెప్టెంబరు లోనే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడట.
ఐతే ఇక్కడ చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. సెప్టెంబరు 24న సాయిధరమ్ తేజ్ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రిలీజవుతోంది. ఈ సినిమాకు నిర్మాత అయిన దిల్ రాజే ‘రుద్రమదేవి’ని నైజాంలో రిలీజ్ చేస్తున్నాడు. ఆయనేమో సెప్టెంబరు ముందు వారం, తర్వాతి వారం వద్దని పట్టుబడుతున్నాడట. అంటే సెప్టెంబరులో మిగిలిందిక 11వ తారీఖు మాత్రమే. ఐతే 4న విడుదల చేయలేని వాడు.. 11న మాత్రం ఎలా రిలీజ్ చేయగలుగుతాడు? కాబట్టి ఆ డేటుకూ కష్టమే. కాబట్టి సెప్టెంబరుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఐతే అక్టోబరులో ఉన్నవన్నీ భారీ సినిమాలే. ఎక్కడా ఖాళీ లేదు. మరీ నవంబరుకు వాయిదా వేశాడంటే గుణశేఖర్ పనైపోతుంది. కాబట్టి ఏం చేసైనా సెప్టెంబరుకే పని ముగించాలి. అంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు ముందు వారమో తర్వాతి వారమో చూసుకోవాలి. తర్వాతి వారం అంటే.. ఆపై వారం అక్టోబరు 2న ఒకటికి మూడు సినిమాలొస్తున్నాయి. కాబట్టి సుబ్రమణ్యం ఫర్ సేల్ కు ముందు వారం అంటే సెప్టెంబరు 18న సినిమాను ఖాయం చేసుకుంటే బెటర్. గుణశేఖర్ ఆలోచన కూడా ఇలాగే ఉన్నట్లు సమాచారం. దిల్ రాజుతో ఈ డేటు గురించి చర్చలు జరుపుతున్నాడట.