Begin typing your search above and press return to search.
#గుణ.. ప్రతాపరుద్రుడిగా స్టార్ హీరోని లాక్ చేసారా?
By: Tupaki Desk | 2 Jun 2021 4:33 AM GMTరుద్రమదేవి తర్వాత గుణశేఖర్ సుదీర్ఘ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొన్నేళ్లుగా హిరణ్య కశిప చిత్రంపై దృష్టి సారించారు. రానా కథానాయకుడిగా సురేష్ బాబు కాంపౌండ్ తో కలిసి స్వీయదర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాల్సి ఉండగా ఎందుకనో వీలుపడలేదు. కరోనా మహమ్మారీ చాలా ప్రణాళికలకు బ్రేక్ వేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో గుణశేఖర్ పూర్తిగా శాకుంతలం కథపై దృష్టి సారించి ఆ సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసేశారట. కరోనా శాంతించగానే మిగతా భాగం తెరకెక్కిస్తారు. ఇక శాకుంతలం తర్వాత గుణ భారీ ప్లానింగ్స్ తో ఉన్నారు.
ఆయన రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడి విరోచిత పోరాటాల కథతో సీక్వెల్ ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంతృప్తికరంగా స్క్రిప్టును కూడా రెడీ చేసి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నిజానికి అనుష్క రుద్రమదేవి రిలీజ్ అనంతరం ఈ సినిమా చేసేందుకు గుణశేఖర్ ఉవ్విళ్లూరినా రుద్రమదేవి ఫ్లాపవ్వడంతో ఆ మాట మళ్లీ తీయలేదు. ఇన్నాళ్టికి ఈ లాక్ డౌన్ లో ప్రతాపరుద్రుడి స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నారట.
అలాగే తనని గోనగన్నారెడ్డి పై సినిమా తీయాలని పలువురు ఒత్తిడి తెచ్చినా కానీ ఆ పాత్ర పరిధి పరిమితం కావడంతో తీయలేనని తెలిపారట. అనవసర కల్పితాలతో హిస్టరీని వక్రించే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారట. ప్రతాపరుద్రుడు చిత్రాన్ని బహుశా రుద్రమదేవికి సీక్వెల్ గా స్టార్ట్ చేసే వీలుంది. అయితే ముందుగా హిరణ్యకశిప చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. హిరణ్యకశిప బహుభాషా చిత్రంగా తెరకెక్కించాల్సి ఉంటుంది కాబట్టి చాలా సమయం పట్టేందుకు ఆస్కారం ఉంది. బడ్జెట్ పరంగా అసాధారణంగా ఉండే వీలుంది.