Begin typing your search above and press return to search.
అటుఇటైతే పరిస్థితి ఏంటి గుణశేఖరా...?
By: Tupaki Desk | 8 Oct 2015 5:55 AM GMTకొత్తొక వింత.. పాతొక రోత అనే సామెత తెలిసిందే. ఒకేదానిని రొటీన్ గా చూపిస్తే ఎప్పుడూ ఈ పాత చింతకాయ పచ్చడేనా అని చీదరించుకుంటారు. అలా అని కొత్తది పరిచయం చేసినా ఇంత డాబు అవసరమా..? అంటూ కొన్ని విసుర్లు వస్తాయి. కానీ ట్రెండ్ సెట్ చేస్తాయి అని అంటున్నారు దర్శకుడు గుణశేఖర్. ఇంతకీ ఈయనేం చేశారంటే...
దర్శకుడిగా కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ హీరోగా చేసిన చూడాలని వుంది సినిమాకి డీటీఎస్ సౌండ్ సాంకేతికను పరిచయం చేశారు. అప్పట్లో దీనికి పాతిక లక్షలు ఖర్చు అయింది. తర్వాత అది కంటిన్యూ అయింది (ఇప్పుడు ఆ స్థానంలోకి డాల్బీ ఆట్మాస్ వచ్చేస్తుంది). తర్వాత మహేష్ తో చేసిన సైనికుడు సినిమాలోనూ హాలీవుడ్ నిపుణుల సాయంతో డిఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) టెక్నాలజీని పరిచయం చేశాడు. ప్రస్తుతం అది కూడా మన సినిమాలో భాగం అయిపొయింది. ఆ కోవలోనే రుద్రమదేవిని త్రీడీలో చేశానని చెప్తున్నాడు గుణ. ఇలా కొత్త సాంకేతికతను ఎవరో ఒకరు పరిచయం చేయాల్సిందే అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయినా తెలుగులో ఇదే తొలి త్రీడి సినిమా అనడానికి లేదు.
కళ్యాణ్ రామ్ ఓం సినిమా ఈ టెక్నాలజీతోనే వచ్చింది మరి. అసలెందుకొచ్చింది ఈ ఆలోచన అంటే.. ఎటూ హై బడ్జెట్ పైగా చారిత్రిక కథతో కూడుకున్నది ఈ రకంగా చూపిస్తే బాగుంటుందని చేశాం అని సమాధానమిచ్చాడు గుణ. చూడాలనివుంది, సైనికుడు సినిమాలకి నిర్మాత అశ్వినీదత్ గారు గనక పరిస్థితి వేరు. ఇప్పుడు వున్నదంతా వూడ్చి మరీ ఇంత చేశావు. జరగరానిది ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి గుణశేఖరా...?