Begin typing your search above and press return to search.
గుణశేఖర్ ఇద్దరు సీఎంలనూ వదల్లేదు
By: Tupaki Desk | 29 Nov 2015 10:03 AM GMTతన కలల సినిమా ‘రుద్రమదేవి’కి అండగా నిలిచినందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులకు తనదైన శైలిలో థ్యాంక్స్ చెప్పాడు గుణశేఖర్. ఈ రోజు అన్ని ప్రముఖ దిన పత్రికల్లోనూ చంద్రబాబు, కేసీఆర్ లకు ధన్యవాదాలు చెబుతూ ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చాడు గుణ. ఇందుకోసం గుణ భారీగానే ఖర్చు పెట్టుకున్నాడు. ఇండస్ట్రీలో ఇలా సినిమాకు అండగా నిలిచినందుకు ప్రభుత్వాధినేతలకు కృతజ్నతలు చెబుతూ ప్రకటనలు ఇచ్చిన ఏకైక వ్యక్తి గుణశేఖరేనేమో.
తెలంగాణ వీరనారి రుద్రమదేవి చరిత్రను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెరకెక్కించినందుకు ఈ సినిమాకు తెలంగాణలో పన్ను మినహాయింపు ఇస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల గుణశేఖర్ కు దాదాపు రూ.3 కోట్ల దాకా పన్నుగా పోవాల్సిన డబ్బు మిగిలింది. ఐతే ఒక్క కేసీఆర్ కే ధన్యవాదాలు చెబుతూ ప్రకటన ఇస్తే బాగోదనుకున్నాడేమో చంద్రబాబును కూడా ఇందులో కలిపాడు. ‘‘మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు ఈ విజయం తెలుగు చరిత్రకు చెందుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందుతుంది. మంచి అభిరుచి ఉన్న ప్రేక్షకులకూ చెందుతుంది’’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నాడు గుణ.